మెగా డాటర్ మేరేజ్ తర్వాత సినీ కెరీర్ సాగుతుందా ?
మెగా ఫ్యామిలీ లో ప్రిన్సెస్ గా రాణిస్తున్న నటి నిహారిక పెళ్లి చేసుకోబోతోందన్న విషయం తేలిపోయింది. గుంటూరు రేంజి ఐజీ జొన్నలగడ్డ కుమారుడు చైతన్యతో నీహారిక పెళ్లి కుదరగా, 2021 లో ఈ వివాహం జరుగబోతోంది. ఓపక్క మెగా డాటర్ కి పెళ్లి కుదరడం ఫాన్స్ కి ఆనందంగానే ఉంది. అయితే పెళ్లి తర్వాత నీహారిక సినీ కెరీర్ ఉంటుందా ఉండదా అనే దానిపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. నీహారిక నటించిన `సూర్యకాంతం` బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయం సాధించకపోయినా నటిగా మంచి మార్కులే పడ్డాయి.దర్శకుడి ప్రయత్నాన్ని అభినందించారు.
అందుకే ఇప్పుడు ప్రణీత్ కి నీహారిక మరో ఆఫర్ ఇచ్చారట. టోకెన్ అడ్వాన్స్ కూడా అందుకున్నాడని టాక్. ప్రతిదీ అనుకున్నట్లు జరిగితే ఈ కాంబినేషన్ మూవీ అక్టోబర్ లో ప్రారంభమవుతుందని అంటున్నారు. దర్శకుడు హరీష్ శంకర్ నిర్మాతగా మారి తెరకెక్కించనున్న ఈ చిత్రానికి సూర్య కాంతం ఫేం ప్రణీత్ దర్శకత్వం వహిస్తారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుపై చర్చలు సాగుతున్నాయట. హరీష్- మహేష్.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తారని తెలుస్తోంది. అయితే దీనిపై పూర్తి క్లారిటీ రావాల్సి ఉంది.
ఇక పెళ్లి తర్వాతా మెగా ప్రిన్సెస్ నీహారిక నటిస్తుందా? అంటే అవుననే తెలుస్తోంది. అక్కినేని కోడలు సమంత తరహాలోనే నిహారిక ప్లానింగ్స్ కూడా ఎక్స్ క్లూజివ్ గా ఉంటాయట. అందుకు మెగా ప్లానింగ్స్ ప్రీప్లాన్ ఉందని ఫిలింసర్కిల్స్ లో వినిపిస్తున్న మాట. అసలు పెళ్లికి కెరీర్ కి ముడి పెట్టి చూడడం సరైన విధానం కాదన్నది మెగా డాటర్ థింకింగ్ అని అంటున్నారు. నీహారికకు ఇప్పటికే వెబ్ సిరీస్ నిర్మాణంలో అనుభవం ఉన్నందున మునుముందు నిర్మాతగానూ మారే వీలుందని భావిస్తున్నారు. ఇక పెళ్లి తర్వాత నటించేందుకు నీహారిక ఓ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే తెలుస్తోంది.