“కేజీయఫ్” రైట్స్ స్టార్ మా ఎన్ని కోట్లకు కొన్నదో తెలుసా?
కన్నడ రాకింగ్ స్టార్ యష్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజీయఫ్” సినిమా దాదాపుగా అన్ని భాషల్లోనూ హిట్ అయింది. ఇప్పుడు దీనికి కొనసాగింపుగా రెండో పార్ట్ కూడా సిద్ధం అవుతుంది. కరోనా కారణంగా “కేజీయఫ్” సెకండ్ పార్ట్ ఆలస్యం అయింది. అయితే “కేజీయఫ్” ఇప్పటివరకు ఎలాంటి టీవీ ఛానెల్లో కూడా రాకపోవడంతో అభిమానులు నిరాశతో ఉన్నారు.
ఇప్పుడు టెలివిజన్ లో రాబోతున్నది. ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా అతి త్వరలో టెలికాస్ట్ చెయ్యనున్నట్టుగా కన్ఫర్మ్ చేసేసారు. అయితే ఈ సినిమా కోసం వారు భారీ మొత్తమే చెల్లించినట్టు తెలుస్తుంది. ఈ చిత్రం కోసం నాలుగున్నర కోట్లకు పైగానే వెచ్చించి కొన్నారట. ఈ సినిమాను ఎప్పుడు టెలికాస్ట్ చేస్తారో?