కళ్యాణి సీరియల్ హీరోయిన్ గాయత్రీ ఇప్పుడు ఎలా ఉందో తెలుసా?
బిగ్ స్క్రీన్ కంటే స్మాల్ స్క్రీన్ లో నటించే వాళ్ళకే క్రేజ్ ఎక్కువా అనేట్టు వ్యవహారం ఉంది. ఎందుకంటే ప్రతిరోజూ మధ్యాహ్నం 12మొదలు వచ్చే సీరియల్స్ అన్నీ జనం తెగ చూస్తున్నారు. వంట అయ్యాక మొదలుపెట్టే సీరియల్స్ నిద్ర పోయేదాకా ఆడవాళ్ళూ సీరియల్స్ చూస్తూనే ఉంటారని టాక్. అందుకే ఏళ్లతరబడి సీరియల్స్ నడుస్తున్నాయి.
సదరు సీరియల్ లో వచ్చే ఘటనను తమ నిజ జీవితంలో జరిగినంతగా వేరేవాళ్లతో సీరియల్ పై చర్చకు దిగుతారు. అంతలా లేడీస్ పై సీరియల్స్ ప్రభావం ఉంటోంది. 1990నుంచి 2005వరకూ వచ్చిన సీరియల్స్ కి ఎక్కువ డిమాండ్ ఉండేది. అప్పట్లో కళ్యాణి సీరియల్ లో నటించిన హీరోయిన్ గాయత్రి ఇప్పుడెక్కడ ఉందొ ఏమి చేస్తోందో ఎవరికీ తెలియడం లేదు.
కేవలం ఒక్క భాషకే కాకుండా ఆరేడు భాషల్లో మాట్లాడే కెపాసిటీ గల నటి గాయత్రి అని చెప్పక తప్పదు. బాలాజీ టెలి ఫిలిమ్స్ లో గాయత్రి మెయిన్ హీరోయిన్ గా ఉండేది. పవిత్ర బంధం ,కళ్యాణి,మట్టెల సవ్వడి,వంటి సీరియల్స్ తో ఆమె జనానికి బాగా చేరువయింది. అప్పట్లో ఓం నమశివాయ సీరియల్ లో పార్వతి దేవి పాత్ర వేసి అందరినీ ఆకట్టుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లైఫ్ లో బిజీగా ఉన్న ఈమె కళ్యాణి వంటి సీరియల్స్ లో నటిస్తుందో లేదో చూడాలి.