పెంగ్విన్ బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాలసిందే… ఊహించని లాభాలు
మహానటి ఫేమ్ కీర్తి సురేష్ కీలక పాత్రలో తెరకెక్కిన పెంగ్విన్ సినిమా 4కోట్ల బడ్జెట్ తో తీశారు. డిజిటిల్ లో బిజినెస్ సొంతం చేసుకున్న ఈ మూవీ లో కీర్తి సురేష్ కి భారీ రెమ్యునరేషన్ దక్కిందని అంటున్నారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్,కెమెరా మెన్ కి కూడా భారీగానే ఇచ్చారట.
అయితే అందరూ కొత్తవాళ్లే అవ్వడంతో ఈ సినిమా బడ్జెట్ 4కోట్లతోనే సరిపెట్టుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ అయివుంటే ఒక్కో భాషలో ఒక్కో రకమైన బిజినెస్ చేసేదని ఫిలిం నగర్ లో టాక్. కానీ కరోనా లాక్ డౌన్ తో థియేటర్లు మూసెయ్యడంతో ఇంకా తెరుచుకోలేదు. ఈనేపధ్యంలో డిజిటల్ రంగంపైనే ఆధారపడాల్సి వచ్చింది. 7న్నర కోట్ల డిజిటల్ బిజినెస్ అన్ని భాషల్లో కలిపి దక్కింది.
అయితే విడిగా విక్రయించి ఉంటే,మరోలా బిజినెస్ అయ్యేదని ,అన్నింటితో కల్పి అమ్మడం వలన బిజినెస్ తగ్గిందని అంటున్నారు. మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ తో కీర్తి చేసిన ఈ సినిమా డిజిటల్ పరంగా మంచి లాభం తెచ్చినా ,ఇంకా ఎక్కువ వచ్చేదని అంటున్నారు. శాటిలైట్ బిజినెస్ టాప్ ఛానల్ కి అమ్ముడైంది. అన్ని భాషలు కల్పి ఆరుకోట్ల రేంజ్ లో డీల్ అయిందట. ఇప్పటికే 13న్నర కోట్ల బిజినెస్ అవ్వడంతో 9కోట్లకు పైనే లాభం వచ్చినట్లయింది. కానీ హిందీ రైట్స్ ఇంకా విక్రయించాల్సి ఉంది.