Movies

తరుణ్,ఆర్తి ల ప్రేమ నిజమేనా… ?

టాలీవుడ్ లో లవర్ బాయ్ అనగానే నువ్వేకావాలి చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్న హీరో తరుణ్ గుర్తొస్తాడు. నిజానికి ఒకనాటి బాలనటి,క్యారెక్టర్ ఆర్టిస్ట్,డబ్బింగ్ ఆర్టిస్ట్ అయిన రోజారమణి కొడుకే తరుణ్. గతంలో భక్త ప్రహ్లాద మూవీతో బాలనటిగా గుర్తింపు పొంది,హీరోయిన్ గా ఆతరువాత క్యారెక్టర్ యాక్టర్ గా చేస్తూ, పలువురు హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పడంలో రోజా రమణి ఆరితేరారు. నటుడు చక్రపాణి ని పెళ్లాడిన ఈమెకు పుట్టిన తరుణ్ కూడా నట వారసత్వం అందిపుచ్చుకున్నాడు.

అందుకే బాలనటుడిగా ఎన్నో సినిమాల్లో చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అంజలి, ఆదిత్య 369, తేజ, పిల్లలు దిద్దిన కాపురం వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా సత్తా చాటాడు. ఇక పెద్దయ్యాక హీరోగా నువ్వే కావాలి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. అమ్మాయిల పాలిట కలలరాకుమారుడిగా మారాడు. నువ్వు లేక నేను లేను వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకెళ్తున్న తరుణ్ ఒక్కసారిగా తెరమరుగయ్యాడు.

దీనికి చాలా పెద్ద కారణమే ఉంది. తనతో నటించిన హీరోయిన్స్ తో ఫ్రెండ్ షిప్ చేసే తరుణ్ తనతో నటించిన అప్పటి హీరోయిన్స్ ఆర్తి అగర్వాల్ తో కూడా స్నేహం చేసి అది కాస్తా ప్రేమగా మారిందని అంటారు. నిజానికి శ్రేయతో నాలుగు సినిమాలు చేసినా మామూలుగానే ఉంది. కానీ రెండు సినిమాలు చేసిన ఆర్తి తోనే ప్రేమలో పడ్డాడట. ఇక ఆమె కు ఎవరితోనో పెళ్లయ్యాక , అకస్మాత్తుగా మరణించినపుడు కూడా తరుణ్ పేరు తెరమీదికి వచ్చింది. ఈ వ్యవహారం తల్లి రోజా రమణి కి కూడా మనస్తాపం కలిగించింది. అయితే ఆర్తితో ప్రేమ అనేది పుకారేనని స్వయంగా తల్లి వివరించింది కూడా.