పూరి జగన్నాథ్ కూతురు ఇప్పుడు ఏమి చేస్తుందో తెలుసా ?
తెలుగు ఇండస్ట్రీలో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా ముద్రపడిన స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ అనగానే ఎందరికో హిట్స్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గుర్తొస్తాడు. తెలుగులోనే కాదు హిందీలో కూడా బిగ్ బి అమితాబ్ తో కల్సి ఓ సినిమా చేసాడు. నిజానికి బద్రి మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి, స్టార్ హోదా దక్కించుకోవడమేకాదు, పవన్ కళ్యాణ్ కి కూడా మంచి బ్రేక్ ఇచ్చాడు.
ఇక సూపర్ స్టార్ మహేష్ బాబుతో తీసిన పోకిరి మూవీ అప్పటిదాకా సినీ ఇండస్ట్రీలో గల రికార్డులన్నీ బ్రేక్ చేసి,బ్లాక్ బస్టర్ అయింది. మహేష్ కెరీర్ ని మలుపు తిప్పింది. వరుస హిట్స్ తో దూసుకెళ్లిన పూరి తర్వాత కొంత వెనుకబడ్డాడు. వరుస ప్లాప్ లు చవిచూశాడు. అయితే రామ్ తో తీసిన ఇస్మార్ట్ శంకర్ తో పూరి మరో హిట్ కొట్టాడు. ఇక పూరి ఫ్యామిలీ విషయానికి వస్తే, భార్య ,ఒక కొడుకు,ఒక కూతురు ఉన్నారు.
పూరి కొడుకు ఆకాష్ ఈ మధ్య సినిమాల్లో హీరోగా ఎంట్రీ ఇచ్చి సినిమాలు చేస్తున్నాడు. ఇక కూతురు పవిత్ర చిన్నప్పుడు బుజ్జిగాడు మూవీలో మాత్రమే కనిపించింది. అందులో ఆకాష్ కూడా చేసాడు. ప్రభాస్ చిన్ననాటి క్యారెక్టర్ ఆకాష్ ,త్రిష చైల్డ్ కేరక్టర్ పవిత్ర చేసారు. బాలయ్య తో పూరి చేసిన పైసా వసూల్ మూవీకి పవిత్ర అసిస్టెంట్ డైరెక్టర్ గా చేయడంతో ఆమె దృష్టి డైరెక్షన్ వైపే ఉందని అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన పిక్స్ ని తరచూ అప్ లోడ్ చేస్తూ ఉండే పవిత్ర ఫేమస్ కార్పొరేట్ కాలేజీలో డిగ్రీ చేస్తోంది.