ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఇప్పుడు ఏమి చేస్తుందో ?
సినిమాల్లో నటించి,కొన్ని హిట్ సినిమాలు చేసాక సడన్ గా తెరమరుగైపోతారు. ఆతర్వాత ఎక్కడైనా తారసపడితే అస్సలు గుర్తుపట్టలేం. సరిగ్గా అలాంటిదే ఇదీనూ. తెలుగులో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఇడియట్ చిత్రంలో టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సరసన బెంగళూరు బ్యూటీ రక్షిత నటించి మెప్పించింది. అయితే ఈ అమ్మడు తెలుగులో అప్పట్లో మహేష్ బాబు, రవితేజ, జూనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున తదితర స్టార్ హీరోల మూవీస్ లో నటించే అవకాశాలు దక్కించుకుంటూ దూసుకెళ్లింది.
మంచి ఫామ్ లో ఉండగానే కన్నడ సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖ దర్శకుడు ప్రేమ్ ని 2007వ సంవత్సరంలో పెళ్లి చేసుకుంది.అయితే పెళ్లి చేసుకున్నా కూడా అప్పుడప్పుడు తెరపై నటిస్తూ కొంతకాలం రక్షిత ప్రేక్షకులని బాగానే అలరించింది. ఆ తర్వాత ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో, భారత జనతా పార్టీ లో చేరింది.అయితే తెలుగులో రక్షిత నటించిన ఇడియట్, నిజం, శివమణి, ఆంధ్రావాలా, అందరివాడు, జగపతి, తదితర చిత్రాలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో రక్షితకి కూడా మంచి గుర్తింపు వచ్చింది.
అయితే సినిమాల్లో నటించడం మానేసిన తర్వాత నటి రక్షిత ఆ మధ్యకాలంలో దేవుడిని దర్శించుకునేందుకు ఆలయానికి రాగా కొందరు ఆమె ఫోటోలను క్లిక్ మనిపించి సోషల్ మీడియా లో షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను ఒకసారి చూస్తే, ఈ మధ్య నటి రక్షిత బాగా బరువు పెరిగినట్లు తెలుస్తోంది. ఇక ఈ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ గురించి అసలు ఆలోచించడం లేదు. సినిమాల పరంగా అవకాశాలు వస్తున్నప్పటికీ నో చెబుతున్న ఈ అమ్మడు కన్నడ భాషకు చెందిన పలు ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ లో ప్రసారమేయ్యే పలురకాల షోలకు జడ్జిగా కూడా వ్యవహరించింది. దీన్ని బట్టి చూస్తే నటి రక్షిత ఇక తెలుగు సినిమాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని తేలిపోయింది.