Movies

హిట్ తర్వాత భారీ గ్యాప్ తీసుకుంటున్న డైరెక్టర్స్ ఎందుకో తెలుసా?

మరి సెంటిమెంటో ఏమిటో గానీ ఒక సినిమా హిట్ ఇచ్చిన తర్వాత డైరెక్టర్స్ గ్యాప్ తీసుకుంటున్నారు. నిజానికి హిట్ తరువాత ఛాన్స్ లు వెల్లువలా వస్తాయి. కానీ కొందరి విషయంలో అలా ఉండదు కూడా. ఎందుకంటే బ్లాక్‌బస్టర్ సినిమాలు చేసి కూడా కొందరు దర్శకులు రెండేళ్ల గ్యాప్ తీసుకున్నారు.

ఎస్ ఎస్ రాజమౌళి తీసిన బాహుబలి 2 ఎప్రిల్ 2017‌లో విడుదలైంది. ఈ మధ్యే మూడేళ్లు పూర్తయింది. ఎప్పట్లాగే రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ కోసం నాలుగేళ్లు తీసుకుంటున్నాడు.

రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన తర్వాత కూడా రెండేళ్లుగా డైరెక్టర్ సుకుమార్ ఒక్క సినిమా కూడా చేయలేదు. ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్నాడు. 2021లోనే ఇది రానుంది. దీన్నిబట్టి ఇండస్ట్రీ హిట్ ఇచ్చి మరీ మూడేళ్లు గ్యాప్ పెట్టినట్లే కదా.

తెలుగు ఇండస్ట్రీలో అత్యధిక లాభాలు తీసుకొచ్చిన జాబితాలో గీతగోవిందం టాప్ 10లో ఉంటుంది. ఈ మూవీ డైరెక్ట్ చేసిన పరశురామ్ రెండేళ్లుగా మరో సినిమాలేదు . ప్రస్తుతం మహేష్ బాబుతో సర్కారు వారి పాట కమిట్ అయ్యాడు.

భరత్ అనే నేను లాంటి హిట్ సినిమా తర్వాత కొరటాల శివ రెండేళ్లుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. చిరంజీవి ఆచార్య కోసం తన టైమ్ అంతా వెచ్చించాడు.

అప్పుడెప్పుడో 2017లో శేఖర్ కమ్ముల ఫిదా సినిమా చేసాక, మళ్లీ ఇప్పటి వరకు కనిపించలేదు. బ్లాక్‌బస్టర్ వచ్చిన తర్వాత కూడా మూడేళ్ల గ్యాప్ వచ్చేసింది. ప్రస్తుతం నాగ చైతన్య, సాయి పల్లవితో లవ్ స్టోరీ సినిమా చేస్తున్నాడు.

మహానటి లాంటి సెన్షేషనల్ హిట్ తర్వాత (2018) రెండేళ్లు గ్యాప్ తీసుకున్న నాగ్ అశ్విన్ కొత్త సినిమా ఇంకా మొదలు కాలేదు. 2021లోనే ఈయన తర్వాతి సినిమా రానుంది.

తొలి సినిమా ఓ మై ఫ్రెండ్ తీసిన వేణు శ్రీరామ్ రెండో సినిమా ఎంసిఏకు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్నాడు. బ్లాక్‌బస్టర్ ఇచ్చిన తర్వాత కూడా మూడేళ్ల గ్యాప్ తీసుకున్న వేణు ప్రస్తుతం పవన్ కళ్యాణ్‌తో వకీల్ సాబ్ చేస్తున్నాడు. ఈ చిత్రం ఇదే ఏడాది విడుదల అవుతుందని టాక్.

పెళ్లిచూపులు తర్వాత తరుణ్ భాస్కర్ చేసిన ‘ఈ నగరానికి ఏమైంది’ ప్రాఫిట్ వెంచర్‌గానే నిలిచింది. కానీ ఈ చిత్రం తర్వాత ఇప్పటికీ మరో సినిమా చేయలేదు. జూన్ 29తో ఈ సినిమా విడుదలై రెండేళ్లు పూర్తవుతుంది.

టాక్సీవాలా సినిమాతో బ్లాక్‌బస్టర్ అందుకున్న రాహుల్ సంక్రీత్యన్ ఇప్పటి వరకు మరో సినిమా చేయలేదు. రెండేళ్లుగా ఖాళీ. ప్రస్తుతం నానితో శ్యామ్ సింగరాయ్ సినిమా చేస్తున్నాడు. అది 2021లోనే రానుంది.

అర్జున్ రెడ్డి అనే ఒకే ఒక్క సినిమాతో ఇండియన్ సినిమాను ఊపిసన సందీప్ రెడ్డి వంగా.. ఇప్పటి వరకు మళ్ళీ సినిమా చేయలేదు. తెలుగు ఇండస్ట్రీ ఇతడికి కలిసొచ్చేలా లేదు.

సమ్మోహనం సినిమాతో అలరించిన ఇంద్రగంటి మోహనకృష్ణ ఇప్పటి వరకు మరో సినిమా విడుదల చేయలేదు. ‘వి’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉన్నా సరే, భారీ గ్యాప్ తప్పలేదు.