అభిమాని కోసం షాకింగ్ నిర్ణయం తీసుకున్న సుమ…ఏమిటో?
సుమ .. ఈ పేరు వినగానే బుల్లితెర ప్రేక్షకులు తమ ఇంట్లో వ్యక్తిగా భావిస్తారు. అంతగా పాపులర్ టివి ప్రోగ్రామ్స్ తో ఆడియన్స్ కి కనెక్ట్ అయిపొయింది. ఎంతమంది యాంకర్స్ వచ్చినా సరే, సుమ స్థానం పదిలమే. వల్గారిటీ ఏమాత్రం లేకుండా కుటుంబ సమేతంగా చూసేలా యాంకరింగ్ చేస్తూ రెండున్నర దశాబ్దాలుగా తన సత్తా చాటుతున్న సుమ సినిమా ఫంక్షన్స్ , ఆడియో వేడుకలు,ప్రీరిలీజ్ ఫంక్షన్స్ ఇలా ఏదైనా సరే, సుమ అవలీలగా నడిపిస్తుంది.
వాస్తవానికి మలయాళీ అయినా, తెలుగు భాషపై పట్టు, సమయస్ఫూర్తి సుమ ఎదుగుదలకు ప్రధాన కారణం. ఎక్కడా మాటతూలకుండా యాంకరింగ్ లో దూసుకెళ్తూ ఇప్పటికీ కూడా నెంబర్ వన్ యాంకర్ గానే ఉంది. వాస్తవానికి దాసరి నారాయణరావు డైరెక్ట్ చేసిన కల్యాణ ప్రాప్తిరస్తు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చినా సక్సెస్ కాలేదు. దాంతో యాంకర్ గా స్థిరపడిపోయింది. అన్ని టీవీలలో ఏదో ఒక పాపులర్ షో చేస్తూ వన్నె తెస్తోంది. ప్రస్తుతం లాక్ డౌన్ తో అందరిలాగానే ఇంటికి పరిమితమైంది.
కాగా తెలుగు వాడైనా రాజీవ్ కనకాలను పెళ్లాడిన సుమ అత్తమామలు దేవదాస్ కనకాల ,లక్ష్మీ దేవిలనుంచి మన సంస్కృతి సంప్రదాయాలు బాగా వంటబట్టించుకుంది. అయితే సుమ ఒకసారి చేపల మార్కెట్ దగ్గరకు వచ్చిందట. అక్కడ ఓ పెద్దాయన ఆమెను చూసి ‘నువ్వు చూడ్డానికి బ్రాహ్మల అమ్మాయిగా కనిపిస్తున్నావు. ఒకవేళ చేపలు తింటే తిను కానీ కొనడానికి మాత్రం నువ్వు రావద్దు’ అన్నారట. దాంతో ఒక అభిమాని అంతగా ప్రేమతో చెప్పారని ఇక అప్పటినుంచి చేపల మార్కెట్ కి వెళ్లడం మానేసిందట. అభిమానులకు విలువ ఇవ్వడంతోనే ఆనందం ఉందని చెప్పింది.