ఈ జంటలను చూడటానికి అభిమానులు ఇబ్బంది పడ్డారు…కారణం ఇదే
సినిమా తీయడం,విడుదల ,ఆతర్వాత ఆడియన్స్ రియాక్షన్ అన్నీ కుదరాలి. హిట్టా ఫట్టా అనేది ఆడియన్స్ తేల్చేస్తారు. ఇక ఒక సినిమా సూపర్ హిట్ అవడానికి కారణంగా స్టోరీతో పాటు స్క్రీన్ పై హీరో హీరోయిన్ల కాంబినేషన్ కీలకం. హీరోకు సరైన జోడి అనిపించే హీరోయిన్ ని సెలెక్ట్ చేసుకుకోవాలి. ఈ విధంగా జోడీ కుదిరి సిల్వర్ స్క్రీన్ పంచుకుని.. హిట్ పెయిర్ గా నిలిచిపోయిన హీరో హీరోయిన్స్ జంటలు చాలానే ఉన్నాయి. అయితే కొన్ని సార్లు దర్శకనిర్మాతలు ఎన్నో అలోచించి హీరో హీరోయిన్లను ఎంపిక చేసినప్పటికీ సిల్వర్ స్క్రీన్ పై వారిని చూడటానికి ఆడియన్స్ కి ఇబ్బందిగానే ఉంటుంది. సినిమా హిట్ అయినా సరే, మళ్ళీ వీరిద్దరూ కలిసి మళ్ళీ యాక్ట్ చేయకపోతే ఇంకా బాగుండేదని అనుకున్న ఘటనలు చాలానే ఉన్నాయి.
ఒకప్పుడు విక్టరీ వెంకటేష్ – జెనీలియా కలిసి ‘సుభాష్ చంద్రబోస్’ సినిమాలో కలిసి నటించినా, వీరిద్దరి జోడీపై అప్పట్లో కామెంట్స్ దారుణంగానే వచ్చాయి. ఇక మెగాస్టార్ చిరంజీవి ‘స్టాలిన్’ సినిమాలో త్రిష చాలా యంగ్ గా కనిపించడంతో ఆడియన్స్ వీరి జంటను చూడటానికి ఇబ్బంది పడ్డారు. ఇక నందమూరి నటసింహం బాలయ్య ‘అల్లరి పిడుగు’ సినిమాలో పొడుగుకాళ్ల సుందరి కత్రినా కైఫ్ అసలు కుదరలేదు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలకి మొదటి నుండి హీరోయిన్స్ ని సెలెక్ట్ పెద్ద సమస్యగానే ఉంటోంది. ముఖ్యంగా ‘ఖలేజా’ సినిమాలో అనుష్క మహేష్ కంటే పెద్దదానిలా కనిపించిందని, హీరోకి అక్క లా కనిపిస్తుంది అనే కామెంట్స్ వచ్చాయి. ఇక ‘నిజం’ సినిమాలో మహేష్ – రక్షిత జోడీ ఆడియన్స్ కి నచ్చలేదని తేలిపోయింది.
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ వయసు రీత్యా హీరోయిన్స్ విషయంలో జాగ్రత్తలు పాటిస్తూనే ఉంటాడు. అయితే ‘లింగా’ సినిమాలో రజినీకి జోడీగా నటించిన అనుష్క – సోనాక్షి సిన్హా కాంబినేషన్ కుదరలేదు. ఇక ‘తుఫాన్’ సినిమాలో రామ్ చరణ్ – ప్రియాంకాచోప్రా జోడీని అసలు భరించలేకపోయారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అజ్ఞాతవాసి’ సినిమాలో కీర్తి సురేష్ – అను ఎమ్మానుయేల్ అస్సలు కుదరలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేసారు. అల్లు అర్జున్ ‘వరుడు’ సినిమాలో భానుశ్రీ మెహ్రా ని హీరోయిన్ గా ఎలా సెలెక్ట్ చేసార్రా బాబు అనిపించింది. ఇక యంగ్ హీరో రామ్ నటించిన ‘గణేష్’ సినిమాలో హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ అస్సలు సెట్ కాలేదు.