Movies

పుష్ప షూటింగ్ ఎప్పటినుంచో తెలుసా…దైర్యం చేస్తున్నారా…?

సుకుమార్,అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న పుష్ప సినిమా కరోనా కారణంగా ఆగిపోయింది. ముందు అనుకున్న విధంగా షెడ్యూల్ జరగకపోవటం,ఇప్పుడు ఉన్న పరిస్థితిలో బయట రాష్టానికి వెళ్లి షూటింగ్ చేయటం కాని పని. అందువల్ల దగ్గరలోనే స్మగ్లింగ్ సీన్స్ అన్ని కాంప్లిట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నాడట.

దాని కోసం లొకేషన్స్ కూడా వెతికేసాడట. తక్కువ మందితో చాలా పగడ్బందీగా చేయాలని భావిస్తున్నారు. ఈ సినిమా రెడ్ శాండిల్ స్మగ్లింగ్ నేపథ్యంలో సాగుతుంది. అందుకే మహబూబ్ నగర్ ప్రాంతంలోని అటవి ప్రాంతంలో స్మగ్లింగ్ సీన్స్ ను షూట్ చేసి మిగతా భాగాన్ని రామోజీ ఫిలిం సిటీలో షూట్ చేయాలనీ ప్లాన్ చేసారు. ఆగస్టు నుంచి షూటింగ్ చేయాలనీ ప్లాన్ చేశారట. అయితే కరోనా ఏమి చేస్తుందో చూడాలి.