ఈ సినిమాల పరిస్థితి ఏమిటో…తొందరగా నిర్ణయం…?
కరోనా రావటంతో సినీ పరిశ్రమ అంతా ఎలా పడితే ఆలా తయారైంది. ఏ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి నెలకొంది. దర్శక నిర్మాతలు నాలుగు నెలలు ముందే పక్కా ప్లానింగ్ తో రిలీజ్ డేట్స్ ను ముందుగానే ప్రకటించి ఆ దిశగా అడుగులు వేస్తున్న సమయంలో కరోనా వచ్చి ప్లానింగ్ మొత్తాన్ని మార్చేసింది.
కాగా నిశ్శబ్దం, రెడ్, మాస్టర్ (తమిళ డబ్), ‘వి’, 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఫస్ట్ కాపీతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. రోజులు గడిచే కొద్దీ నిర్మాతల మీద అదనపు భారం పెరిగిపోతుంది.
నిశ్శబ్దం మాత్రం ఓటిటీలో రిలీజ్ చేయటానికి ప్లాన్ చేస్తున్నారు. రెడ్, ‘వి’ 30 రోజుల్లో ప్రేమించడం ఎలా?, ఒరేయ్ బుజ్జిగా, ఉప్పెన లాంటి సినిమాలు ఓటిటీలో రిలీజ్ చేయటానికి నిర్మాతలు ఒప్పుకోవటం లేదు. నిర్మాతలు మనస్సు మార్చుకొని ఓటిటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసుకుంటే బెటర్.