Movies

రష్మిక సినిమాకు సైన్ చేయాలంటే రెండు కండిషన్స్ తప్పనిసరి…స్టార్ హీరో అయినా సరే

స్టార్ స్టేటస్ ఉన్నప్పుడు వాళ్ళ రేంజ్ మాములుగా ఉండదు. కండీషన్స్ అప్లై అన్నట్లు ఉంటుంది. దాన్నే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవడం,జాగ్రత్తపడడం ఇలా రకరకాలుగా అంటారు. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ గా రష్మిక మందన్న రాణిస్తోంది. గీత గోవిందం,సరిలేరు నీకెవ్వరు వంటి మూవీస్ తో టాప్ రేంజ్ లోకి వెళ్ళింది. తాజాగా ఈ అమ్మడు ప్రస్తుతం అల్లు అర్జున్ తో పుష్ప చిత్రం లో చేసేందుకు రెడీ అవుతోంది.

ఈ ఏడాది సంక్రాంతికి మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరు హిట్ అందుకున్నాక .. నితిన్ తో జతకట్టి భీష్మ మూవీతో కూడా మరో హిట్ కొట్టింది. ఇలా ఒకే ఏడాది అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. ప్రస్తుతం వైరస్ భయంతో పూర్తిగా ఇంటికే పరిమితం అవుతున్న రష్మిక సోషల్ మీడియా ద్వారా అలాగే ఇంటర్వ్యూల ద్వారా అభిమానులకు దగ్గరగానే ఉంటోంది.

తాజాగా ఫాన్స్ తో చిట్ చాట్ సందర్బంగా రష్మిక తన సినిమాల ఎంపిక విషయమై ఆసక్తికర కామెంట్స్ చేస్తూ ‘నేను సినిమాలు కమిట్ అయ్యేందుకు ప్రధానంగా రెండు విషయాలను పరిగణలోకి తీసుకుంటాను. నా పాత్రలో ఎమోషన్ డెప్త్ గా ఉండాలి. అలాగే ఫుల్ లెంగ్త్ ఎంటర్ టైన్మెంట్ అందించే విధంగా అయినా ఉండాలి”అని చెప్పుకొచ్చింది. తన మొదటి సినిమా కిరాక్ పార్టీ నుండి ఇప్పటి వరకు కూడా ఇదే ఫాలో అవుతున్న ఈ భామ కథలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే నటిస్తా లేదంటే లేదు అని కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది.