Movies

మల్టీస్టారర్ మూవీ వెనుక ఎన్నెన్ని ఘట్టాల్లో … చూస్తే అసలు నమ్మలేరు

ఇప్పుడిఇప్పుడే మల్టీస్టారర్ మూవీ మళ్ళీ వస్తున్నాయి గానీ,ఒకప్పడు మల్టీస్టారర్ మూవీ లెక్కకుమించి వచ్చాయి. అగ్రనటులు ఎన్టీఆర్, అక్కినేని; ఎన్టీఆర్, కృష్ణ;అక్కినేని,కృష్ణ; శోభన్ బాబు, కృష్ణ,;కృష్ణ ,కృష్ణంరాజు ఇలా చాలా సినిమాలే వచ్చాయి. చాలా హిట్ అయ్యాయి కూడా. ఎన్టీఆర్ ,అక్కినేని కల్సి 14సినిమాలు చేయడం ఇప్పటికీ ఓ రికార్డ్. ఇప్పటివరకూ ఇదే రికార్డ్ గా నిల్చిందంటే అప్పట్లో మల్టీస్టారర్ మూవీ ఎలా వచ్చేవో చెప్పక్కర్లేదు.

హీరోల ఆలోచన మారిందా, ఫాన్స్ వట్టిదా అసలు ఎందుకు మల్టీస్టారర్స్ అంతలా రావడం లేదని పరిశీలిస్తే,… చిరంజీవికి బ్రేక్ ఇచ్చిన ఖైదీ మూవీ చేసిన సంయుక్త మూవీ వాళ్ళు కృష్ణ , శోభన్ బాబు లతో మహా సంగ్రామం అనే భారీ మూవీని ఏ కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లోనే తీశారు. పరుచూరి బ్రదర్స్ స్క్రిప్ట్ రెడీ చేసారు. బడ్జెట్ కూడా అనుకున్నదానికంటే ఎక్కువే అయింది. శోభన్ బాబు పోలీసాఫీసర్ గా, కృష్ణ నక్సలైట్ గా తీసిన ఈ సినిమా పై భారీ అంచనాలే ఏర్పడ్డాయి.

అయితే ఆడియన్స్ లో హైప్ కి అనుగుణంగా ఈ సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. శోభన్ బాబు పాత్రను బాగా తగ్గించేశారని ఫాన్స్ చాలా హర్ట్ అవ్వడమే కాదు, ఇలాంటి సినిమాలు యాక్ట్ చేయవద్దని శోభన్ పై వత్తిడి తెచ్చారు. కథ సమయంలోనే తేడా జరిగిందని పరుచూరి బ్రదర్స్ పై ఆగ్రహం కూడా వ్యక్తంచేసిన శోభన్ బాబు ఇక మల్టీస్టారర్ చేయనని యాడ్ రూపంలో కూడా ప్రకటచేసాడు. ఇక ఈ సినిమా ఎవ్వరికీ హ్యాపీ ఇవ్వలేదు సరికదా, కొన్నవాళ్లకు ,థియేటర్స్ కి నష్టాలను మిగిల్చింది. అలా మల్టీస్టారర్ కి దూరమయ్యారు. కేవలం ఫాన్స్ వల్లే ఇలా అయింది. అందుకే మెగాస్టార్ తరం వచ్చాక ఇలాంటి సాహసాలు ఎవరూ చేయలేదు.