Movies

టాలీవుడ్ యంగ్ హీరోని గుర్తు పట్టారా.. ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి

ఏ రంగమైనా లాక్ డౌన్ కి ముందు,లాక్ డౌన్ కి తర్వాత అన్నట్లే మారిపోయింది. ఇక సినిమా రంగంలో కూడా చాలామందికి ఇబ్బందే వచ్చింది. ఇక యంగ్ హీరో సందీప్ కిషన్ “ప్రస్థానం” అనే మూవీతో తెలుగులో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చాడు. సందీప్ కిషన్ ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు జీవన్ కనుకొలను దర్శకత్వం వహిస్తున్న ఏ వన్ ఎక్స్ ప్రెస్ అనే ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన పలు చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు టాక్. లాక్ డౌన్ తో మిగిలిన పనులు ఆగాయి.

ఇక తమిళ భాషలో కూడా నరగాసురన్ అనే చిత్రంలో ప్రాధాన్యత గల పాత్రలో నటిస్తున్నాడు.ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు కార్తీక్ నరేన్ దర్శకత్వం వహిస్తున్నాడు. నిజానికి ప్రముఖ దర్శకుడు దేవాకట్ట దర్శకత్వం వహించినప్రస్థానం మూవీలో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించి తెలుగు సినీ పరిశ్రమకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న సందీప్ ఇటీవలే సందీప్ కిషన్ టాలీవుడ్ ప్రముఖ సినిమాటోగ్రాఫర్ చోటా కె నాయుడుతో కలిసి తన చిన్నప్పుడు తీసుకున్న ఫోటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఫాన్స్ తో పంచుకున్నాడు. అలాగే ఈ ఫోటో ద్వారా చిన్నప్పటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చోటా కె నాయుడు కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు.దీంతో ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.