Movies

లాక్ డౌన్ సమయంలో సోషల్ మీడియా పోస్ట్‌ తో ప్రియాంక బిజినెస్ అదరహో…ఎన్ని కోట్లో ?

బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా తన అందం అభినయంతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లయినా సరే, సినిమాల్లో దూసుకెళ్తోంది. ప్రియాంక నటించిన రీసెంట్ హిందీ సినిమా ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ ఆ మధ్య విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ప్రియాంక ప్రస్తుతం ‘వి కెన్‌ బి హీరోస్‌’, ‘ది మాట్రిక్స్‌ 4’, ‘ది వైట్‌ టైగర్‌’ వంటి సినిమాల్లో నటిస్తోంది. ‘ది వైట్‌ టైగర్‌’‌ను నెట్‌ప్లెక్స్ సంస్ధ నిర్మిస్తోంది. ఈ ముద్దుగుమ్మ అమెరికన్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను సంవత్సరం పాటు ప్రేమించి పెళ్లి చేసుకుని ప్రస్తుతం అమెరికాలోని లాస్ ఎంజెల్స్‌లో కాపురం పెట్టింది. అయితే పెళ్లి తర్వాత ఈ అమ్మడు పాపులారిటీ మరింత జోరందుకుంది. అవును, ఇప్పుడు అందరికీ ఫ్లాట్ ఫారం సోషల్ మిడియా కదా. అందునా సెలబ్రిటీలు అయితే అస్సలు చెప్పక్కర్లేదు. అయితే వీళ్ళు అప్పుడప్పుడూ కొన్ని పేయిడ్ పోస్ట్‌లు చేస్తుంటారు.

మామూలు జనానికి సరదా ఏమో గానీ వీళ్లు మాత్రం పెట్టె ఒక్కో పోస్ట్ విలువ ఎంతో తెలిస్తే గుండే గుభేల్ మనాల్సిందే. అంతలా సెలబ్రిటీలకు సోషల్‌మీడియా ప్లాట్‌ఫామ్స్‌ భారీ ధనార్జనకు అసలైన రహదారి అయింది. ఇక ప్రియాంకచోప్రా ఇన్‌స్టాగ్రామ్‌లో చేసే ఒక్కపోస్ట్‌కు రెండుకోట్లకు పైగా చార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రియాంకకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఐదున్నర కోట్లకుపైగా ఫాలోవర్స్‌ ఉన్నారు. దీన్నే అదునుగా చూసుకుని పాపులర్ బ్రాండెడ్స్ తమ ఉత్పత్తులను సోషల్ మీడియాలో షేర్ చేయాలనీ ఒప్పందం కుదర్చుకుంటాయి.. అందులో భాగంగా ప్రియాంక అప్పుడపుడు కొన్ని ఉత్పత్తుల్నీ తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంటుంది. అలా ఒక్క ప్రమోషనల్‌ పోస్ట్‌కు 2కోట్లు సంపాదిస్తూ భారత సినీతారల్లో అగ్రస్థానానికి చేరింది. అంతేకాదు ప్రియాంక ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అధిక ఆదాయాన్ని ఆర్జిస్తున్న ప్రపంచ సెలబ్రిటీల్లో 28వ స్థానంలో ఉంది.

ఈ సంపాదనలో ఒకప్పటి రెజ్లింగ్ స్టార్ ఇప్పటి హాలీవుడ్‌ నటుడు డ్వేన్‌ జాన్సన్‌ ఒక్కపోస్ట్‌కు 8కోట్లు సంపాదిస్తూ ప్రపంచంలోనే సెలెబ్రీటిల్లో నెంబర్ వన్ అయ్యాడు. అంతేకాదు,.. ప్రియాంక తాజాగా అమెజాన్ ప్రైమ్ తో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. రెండు సంవత్సరాల పాటు కొనసాగనున్న ఈ ఒప్పందం విలువ కోట్లాది రూపాయల్లో ఉందట. హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓ కార్యక్రమాన్ని రూపొందించనుంది . ఈ సందర్భంగా ప్రియాంక మాట్లాడుతూ.. తాము నిర్మించే ఈ షోలతో మరింత భారతీయతను ప్రదర్శిస్తామని తెలిపింది. అంతేకాదు ప్రాంతీయ భేదాలు, భాషా భేదాలు లేకుండా ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే టాలెంట్‌కు ఇది ఒక ప్లాట్ ఫామ్ ఉండనుందని.. అదే తన కోరికని… అందుకే సొంత నిర్మాణ సంస్థ పర్పుల్ పెబల్ పిక్చర్స్ ను స్థాపించానని ఈ అమ్మడు చెబుతోంది.