బిగ్‌బాస్ సీజన్ 4లో కింగ్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?
బుల్లితెరమీద ఒక్కో ప్రోగ్రాం కి ఒక్కో రేటింగ్ ,ఫాలోయింగ్ ఉంటుంది. జబర్దస్త్ కామెడీ ప్రోగ్రాం ప్రారంభం నుంచీ ఇప్పటికీ అదే రేటింగ్ లో సాగిపోతోంది. ఇక రియాల్టీ షోస్ లో ప్రత్యేకంగా చెప్పాలంటే, బిగ్‌బాస్ రియాలిటీ షో క్రేజ్ కూడా అలానే ఉంటుందని చెప్పాలి. అయితే ఎన్నో వివాదాలు,విమర్శల నేపథ్యంలో ఇప్పటికే మూడు సీజన్స్ తెలుగులో పూర్తిచేసుకున్న బిగ్ బాస్ షో ఇప్పుడు 4వ సీజన్ కి రెడీ అవుతోంది. ఈ షో కోసం జనాలు టీవీలకే అతుక్కుపోయి చూస్తారు. తొలి సీజన్‌ను యంగ్ టైగర్ ఎన్టీఆర్ యాంకర్‌గా చేసి, ఆ షోను ఓ రేంజ్‌కు తీసుకెళ్లాడు.ఇక రెండో సీజన్‌కు నాని, మూడో సీజన్‌కు నాగార్జున హోస్ట్‌లుగా చేసి, బిగ్‌బాస్‌ను టాప్ రియాలిటీ షోగా నిలిపారు.
ఇక ఎప్పుడా ఎప్పుడా అని చూస్తున్న బిగ్‌బాస్ 4వ సీజన్‌కు నిర్వాహకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటిదాకా లాక్ డౌన్ ఎఫెక్ట్ కారణంగా ముందుకు నడవలేదు. కానీ కొన్ని సడలింపులు ఇవ్వడంతో ఈసారి మరింత క్రేజ్ ఉన్న సెలెబ్రిటీలను పార్టిసిపెంట్స్‌గా పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.ఇందుకు సంబంధించిన పనులను కూడా వారు అప్పుడే మొదలుపెట్టేశారు.ఇక ఈ సీజన్‌కు హోస్ట్‌గా ఎవరు ఉంటారా అనే ప్రశ్నకు మరోసారి అక్కినేని నాగార్జున రూపంలోనే సమాధానం లభించింది. గతేడాది నాగ్ చేసిన యాంకరింగ్‌కు ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. అందుకే నాగ్‌నే హోస్ట్‌గా పెట్టాలని నిర్వాహకులు భావిస్తున్నారు.
అన్నీ బాగానే ఉన్నా నాగ్ ఈసారి బిగ్‌బాస్ షోకు ఎంతమేర రెమ్యునరేషన్ తీసుకుంటాడనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈసారి నాగ్ తన రెమ్యునరేషన్ తగ్గిస్తాడనే వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. మరోపక్క ఇదంతా పుకార్లుగా నిర్వాహకులు అంటున్నారు.మూడో సీజన్‌కు నాగ్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో, ఈసారి కూడా అంతే ఇస్తారట. దీనికి సంబంధించి ఒప్పందం కూడా చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే పలువురు టివి నటులకు కరోనా వచ్చిన నేపథ్యంలో బిగ్ బాస్ షో ఎప్పుడు మొదలవుతుందో చెప్పడం కూడా కష్టమే.