Movies

బిత్తిరి సత్తి కొత్త జాబ్‌ లో భారీ ఆఫర్….ఎంతో తెలుసా ?

తెలుగు బుల్లి తెర సెలబ్రెటీలకు ఈమద్య కాలంలో స్టార్‌ స్టేటస్ బాగానే వస్తోంది. బుల్లి తెరపై సందడి చేసే వారిని ప్రేక్షకులు సినిమా స్టార్స్‌ కంటే కూడా అధికంగా అభిమానిస్తున్నారు. సీరియల్‌ నటీనటులు, యాంకర్స్‌ మాత్రమే కాకుండా తీన్మార్‌ ద్వారా పరిచయం అయిన బిత్తిరి సత్తి అలియాస్‌ చేవెళ్ల రవిపై జనాలు ఏ స్థాయిలో అభిమానం కురిపిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.తీన్మార్‌ వార్తలు సూపర్‌ సెన్షేషనల్‌ సక్సెస్‌ అవ్వడంతో బిత్తిరి సత్తికి స్టార్‌ హోదా దక్కింది.

వీ6 యాజమాన్యంతో విభేదాల కారణంగా బిత్తిరి సత్తి తీన్మార్‌ను వదిలేసి టీవీ9లో ప్రసారం అవుతున్న ఇస్మార్ట్‌ న్యూస్‌కు వచ్చేశాడు.అయితే టీవీ9తో కనీసం ఏడాది కూడా నడవకుండానే అప్పుడే సదరు ఛానెల్‌ను సత్తి వదిలేశాడు.మొదట బిగ్‌బాస్‌ ఆఫర్‌ రావడం వల్లే వదిలేశాడు అంటూ ప్రచారం జరిగింది.ఆ క్రేజ్‌తో సినిమాల్లో నటించడంతో పాటు పలు స్టేజ్‌ షోలు చేయడం చేతినిండా డబ్బు సంపాదించడం చేశాడు.

అయితే సత్తి తర్వాత జర్నీ ఎటు అంటూ చాలా మంది ఎదురు చూస్తున్న సమయంలో సాక్షి టీవీలో అధికారికంగా చేరడంతో పాటు అక్కడ టీమ్‌తో వెల్‌కమ్‌ పార్టీ కూడా తీసుకున్నాడు.సత్తితో పని చేసిన మరికొందరు కూడా సాక్షి టీవీలో జాయిన్‌ అయ్యారు. వీరంతా కలిసి వీ6 ‘తీన్మార్‌ వార్తలు’, టీవీ9 ‘ఇస్మార్ట్‌ న్యూస్‌’ వంటి న్యూస్‌ బులిటెన్‌ ఒకటి ప్లాన్‌ చేస్తున్నారట. అతి త్వరలోనే ఆ కొత్త కార్యక్రమం సాక్షిలో ప్రసారం కాబోతుందని టాక్. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే, సాక్షి టీవీ వారు బిత్తిరి సత్తికి భారీ ఆఫర్‌ ఇచ్చారట. నెలకు దాదాపుగా రెండున్నర లక్షల సాలరీ సత్తికి అందబోతుంది.దాంతో పాటు ఇతర కార్యక్రమాలు చేసుకునేందుకు అనుమతి, ఎంటర్‌టైన్‌మెంట్‌ ఛానెల్స్‌లో ప్రసారం అయ్యే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అడ్డు చెప్పకూడదనేది ఒప్పందం అని టాక్.