ఇంద్రుడు చంద్రుడు సినిమా గురించి తెలియని నమ్మలేని నిజాలు
టాలీవుడ్ లో ఎన్నో డ్యూయల్ రోల్ మూవీస్ వచ్చినా అందుకు భిన్నంగా డ్యూయల్ రోల్ తో కమల్ హాసన్ నటించిన ఇంద్రుడు చండుడు మూవీ అప్పట్లో ఓ బ్లాక్ బస్టర్. 1989లో వచ్చిన ఈ మూవీలో కమల్ హాసన్ సరసన విజయశాంతి నటించింది. మూవీ మొఘల్ డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ మూవీకి సురేష్ కృష్ణ డైరెక్షన్ చేసాడు. ఇళయరాజా అద్భుతమైన పాటలు ఆకట్టుకున్నాయి. లాలి జో లాలి జో పాటకు అందరూ హేట్సాఫ్ చెప్పారు.
ఈవీవీ సత్యనారాయణ అసిస్టెంట్ గా చేయడమే కాకుండా ఓ చిన్న వేషం తో తళుక్కున మెరుస్తాడు. డబ్బే ప్రధానంగా వ్యవహరించే ఓ మేయర్ అసిస్టెంట్స్ కుట్ర కారణంగా చనిపోతాడు. శవాన్ని మార్చురీలో దాచిపెడతారు. అదేసమయంలో మేయర్ పోలికలతో గల ఓ యువకుడు కనిపించడంతో అతడిని ఒప్పించి, డబ్బు ఆశ చూపించి మేయర్ వేషంలో రంగంలో దించి, తమ పనులు చేయించుకుంటూ ఉంటారు. అంతాబానే ఉందన్న సమయంలో యితడు ఓ అమ్మాయి ప్రేమలో పడతాడు. అక్కడ నుంచి సినిమా ఎన్నో ఆసక్తికర మలుపులు తిరుగుతుంది.
డైలాగ్ రైటర్స్ పరుచూరి బ్రదర్స్ తమ రెగ్యులర్ శైలికి భిన్నంగా స్క్రీన్ ప్లే అందించారు. చరణ్ రాజ్, జయలలిత, గొల్లపూడి మారుతీరావు, పీఎల్ నారాయణ వంటి నటులు తమ అద్భుత నటన కనబరిచారు. ఓపక్క వినోదం పంచుతూ మరోపక్క సీరియస్ నెస్ నడుస్తూ సాగిన ఈ సినిమా ఆడియన్స్ ని బాగా మెప్పించింది. మేయర్ వేషానికి ఒప్పుకున్న కమల్ ఓపక్క ప్రేమలో కొనసాగుతూనే ఓ తల్లికోసం తపించే కొడుకుగా యాక్టింగ్ అదరగొట్టాడు. ఇంద్రన్ చంద్రన్ పేరిట డబ్బింగ్ చేయగా అక్కడా సూపర్ హిట్ అయింది.