“ఆ నలుగురు” సినిమా గురించి కొన్ని నమ్మలేని నిజాలు…ఎన్ని కోట్ల లాభమో?
జర్నలిస్టు జీవితాలను,సగటు మనిషి నిజాయితీని ఆవిష్కరిస్తూ తీసిన ఆ నలుగురు సినిమా అప్పట్లో ఓ సంచలనం. డబ్బు కంటే నమ్ముకున్న విలువలు గొప్పవని, సమాజం పట్ల ప్రేమ ఉంటె ఆ సమాజమే మనల్ని గుర్తుపెట్టుకుంటుందని చాటిన సినిమా ఇది. మంచి కంటెంట్ ,ఎమోషన్ గల ఈ సినిమాను చంద్ర సిద్ధార్ధ తెరకెక్కించాడు. నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్ హీరోగా వచ్చిన ఈ సినిమా కమర్షియల్ గా కూడా హిట్ అయింది. 2004నవంబర్ లో నలుగురు జర్నలిస్టుల చేత ఆడియో లంచ్ అయింది. డిసెంబర్ 9న 25ప్రింట్స్ తో రిలీజ్ అయింది. మదనపల్లిలో జరిగిన ఓ ఇన్సిడెంట్ మదన్ అనే వ్యక్తిని కదిలించింది. ఊరంతా అప్పులు చేసినా సరే, … ఆ విషయం గురించి కాకుండా అతడి మంచితనం గురించి మాట్లాడుకోవడం, ఊరందరూ దహన సంస్కారానికి రావడం డైరెక్టర్ గమనించాడు. మదన్ డిగ్రీలో ఉండగా జరిగిన ఈ ఘటనపై డబ్బుకంటే విలువలు ముఖ్యమని ఓ కథ రాసుకున్నాడు.
రైటర్ గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సినిమా తీయాలని అనుకున్నాడు. అంతిమయాత్ర టైటిల్ తో ఈటీవీలో సీరియల్ గా చేయాలనుకున్నాడు. చావుకథ అని రిజెక్ట్ చేయడంతో అట్లూరి పూర్ణచంద్రరావు ని కల్సి వివరించాడు. దాంతో ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. ఇక డివి నరసరాజు ఇందులో కొంత సహకారం అందించారు. డైరెక్టర్ భాగ్యరాజాను డైరెక్ట్ చేయమని అడిగితె,తెలుగు,తమిళంలో తానే చేస్తానని,హీరో కూడా నేనేనని చెప్పడంతో అట్లూరి ఒప్పుకోలేదు. ప్రకాష్ రాజ్ దగ్గరకు మదన్ వెళ్ళాడు. ఇలాంటివి సినిమాకు పనికిరావని అనేశాడు. ఇక డైరెక్టర్ చంద్రసిద్ధార్ద తో మదన్ కి పరిచయం ఉండడంతో ఇంటికి వెళ్తే,వాళ్ళన్నయ్య ఉన్నాడు. అతనికి కథ విన్పించడం,తమ్ముడు వచ్చాక కథచెప్పి చేయమనడం జరిగాయి. అట్లూరి దగ్గరకు వెళ్లి స్క్రిప్ట్ అడిగితె,తమిళ్ రైట్స్ ఉంచుకుని తెలుగు రైట్స్ ఇచ్చేసారు.
రాజేంద్రప్రసాద్ ని హీరోగా అనుకుని వెళ్తే, కథవిన్నాక బాల్కనీలోకి వెళ్లి కన్నీటిపర్యంతం అయ్యాడు. మూవీకి ఒకే చెప్పేసాడు. రోజా, భానుప్రియ కాదనడంతో ఆమని ఒకే చెప్పింది. మిగిలిన నటులను సెలెక్ట్ చేసి, ఆర్పీ పట్నాయక్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టి,రామకృష్ణ స్టూడియోస్ లో సినిమా స్టార్ట్ చేసారు. 38రోజుల పనిదినాల్లో పూర్తిచేశారు. టైటిల్ ఆ నలుగురు అని పెట్టారు. మిత్రులతో కల్సి చంద్ర సిద్దార్ధ తీసిన ఈమూవీకి ఒక కోటి 25లక్షల బడ్జెట్ అయింది. ఇక శవ యాత్ర సీన్స్ ఎడిటింగ్ అవుతోంది. సరిగ్గా అదే సమయంలో ఈ సినిమా చూడాలని ఎంతోఆశతో ఎదురుచూస్తున్న చంద్ర సిద్దార్ధ తండ్రి చనిపోయిన వార్త. ఇది విధి విచిత్రమే. ఇక సినిమా రిలీజ్ అయ్యాక 10రోజులు కలెక్షన్ నిల్. ప్రింట్స్ కూడా వెనక్కి వచ్చేస్తున్నాయి. అంతలోనే అద్భుతంగా ఉదయం ఆట ఫుల్. మాట్ని ఫుల్. అలా కొన్ని రోజులు ఫ్యామిలీ ఆడియన్స్ తో నిండాయి. ప్రేమ ,విలువలే ముఖ్యమని చాటిన ఈమూవీ లో రఘురాం గా రాజేంద్రప్రసాద్ నటన లో జీవించాడు. కోట శ్రీనివాసరావు నటన హైలెట్. క్లైమాక్స్ కంటతడి పెట్టిస్తుంది. రాజేంద్రప్రసాద్ కి బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డు వచ్చింది. ఉత్తమ చిత్రంగా కూడా ఆ నలుగురు నంది తెచ్చుకుంది. ఇక బడ్జెట్ కి డబుల్ లాభాలు తెచ్చింది.