అల్లు అర్జున్ సినిమాల బడ్జెట్,కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి
మెగా కాంపౌండ్ బ్యాక్ గ్రౌండ్ తో అల్లువారి అబ్బాయిగా సినీ ఇండస్ట్రీకి గంగోత్రి మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ తన టాలెంట్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. డాన్స్, ఫైట్స్ ,నటనతో వరుస హిట్స్ తో రాణిస్తూ,ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్నాడు. కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో2003లో వచ్చిన గంగోత్రి మూవీకి కేవలం 3కోట్లు పెడితే… 11కోట్లు కలెక్ట్ చేసి హిట్ కొట్టింది. తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఆర్య సూపర్ హిట్. దీనికి 4కోట్లు పెడితే,15కోట్లు తెచ్చిపెట్టింది. 2005లో తన నిక్ నేమ్ బన్నీ తోనే వినాయక్ తీసిన బన్నీ మూవీ హిట్. 6కోట్లు పెడితే,12కోట్లు పైనే వసూలుచేసింది. కరుణాకరన్ డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ ప్లాప్. 16కోట్లకు గాను 18కోట్లు కలెక్ట్ చేసింది.
పూరి జగన్నాధ్ డైరెక్షన్ లో వచ్చిన దేశముదురు బ్లాక్ బస్టర్ అయింది. 10కోట్లతో తీస్తే, 26కోట్లు వసూలు చేసింది. 2008లో వచ్చిన పరుగు మూవీ యావరేజ్. 15కోట్లతో తీస్తే ,డబుల్ కలెక్ట్ చేసింది. తర్వాత సుకుమార్ డైరెక్షన్ లో ఆర్య సీక్వెల్ గా తీస్తే అంతగా ఆకట్టుకోలేదు. 14కోట్లతో తీసిన ఈ సినిమాకు 32కోట్లు వసూలైంది. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన వరుడు మూవీ ప్లాప్. 30కోట్లు పెడితే,21కోట్లు మాత్రమే తెచ్చింది. క్రిష్ డైరెక్షన్ లో వచ్చిన మల్టీస్టారర్ వేదంలో బన్నీ కేబుల్ రాజు పాత్రలో నటించాడు. 17కోట్లు ఖర్చుచేస్తే 26కోట్లు తెచ్చింది. ఇక 20కోట్లతో తీసిన బద్రీనాధ్ 40కోట్లు వసూలుచేసింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో బన్నీ తొలిసారి చేసిన జులాయి బ్లాక్ బస్టర్. 36కోట్లు పెడితే,103కోట్లు వసూలుచేసింది. దీంట్లో వందకోట్ల క్లబ్ లో చేరాడు.
పూరి డైరెక్షన్ లో ఇద్దరమ్మాయిలతో మూవీ చేసిన బన్నీకి నిరాశ మిగిలింది. 60కోట్లు ఖర్చు పెడితే 70కోట్లు పైనే వసూలు చేసింది. సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన రేసుగుర్రం మూవీ భారీ హిట్ కొట్టింది. 40కోట్లు ఖర్చుపెడితే,70కోట్లు పైనే వసూలుచేసింది. మళ్ళీ త్రివిక్రమ్ డైరెక్షన్ లో సన్నాఫ్ సత్యమూర్తి మూవీ చేసాడు. యావరేజ్ గా నిల్చిన ఈ మూవీకి 45కోట్లు ఖర్చుచేస్తే,93కోట్లు పైనే రాబట్టింది. ఇక రుద్రమదేవిలో గోనగన్నారెడ్డి క్యారెక్టర్ వేసి ఆకట్టుకున్నాడు. 60కోట్ల బడ్జెట్ తో తీసిన ఈ మూవీ 86కోట్లు వసూలు చేసింది.
ఇక హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన దువ్వాడ జగన్నాధం డీజే మూవీ బ్లాక్ బస్టర్. 67కోట్లు ఖర్చుచేయగా, 114కోట్లు వసూలు చేసింది. తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్ లో వచ్చిన నాపేరు సూర్య నా ఇల్లు ఇండియా మూవీ అంతగా ఆకట్టుకోలేదు. అయితే 32కోట్లు పెడితే,90కోట్లపైనే తెచ్చింది. ఇక మొన్న సంక్రాంతికి త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అలవైకుంఠపురంలో మూవీ ఇండస్ట్రీ హిట్ అయింది. 80కోట్ల పైనే పెట్టి తీసిన ఈ భారీ సినిమా 250కోట్లపైనే వసూలుచేసింది. ఇప్పటికీ ఈ మూవీలోని సాంగ్స్ ఆదరిపోతూనే ఉన్నాయి. వ్యూస్ లో కూడా రికార్డ్ క్రియేట్ చేసింది.