Movies

ఈ ఫొటోలో కనపడుతున్న ముగ్గురు స్టార్ హీరోలను గుర్తు పట్టారా?

ఇదేదో సినిమా టైటిల్ అనుకున్నారేమో కాదు, ఓ ఫ్యామిలీలో ముగ్గురు అన్నదమ్ముల బంధం, వారి హవా అలాంటిది. వాళ్ళే మెగా బ్రదర్స్. తెలుగులో ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమకు వచ్చి స్వశక్తితో ఛాన్స్ లు దక్కించుకొని మంచి గుర్తింపు తెచ్చుకోవడం మెగాస్టార్ చిరంజీవికే దక్కింది. అంతేకాదు,తన ఛరిష్మాతో తన ఇద్దరు తమ్ముళ్ళకి మాత్రమే కాకుండా ఎంతో మంది యువ నటీనటులకు మార్గ నిర్దేశనం చేసి ముందుకు నడిపించిన టాలీవుడ్ మెగాస్టార్ గా నిలిచాడు. ఈ ముగ్గురిలో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగితే,, నాగబాబు మంచి నటుడిగా అలాగే నిర్మాతగా ఎదిగాడు.

ఇక రెండో తమ్ముడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ గా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు సాధించి, జనసేన పార్టీతో రాజకీయాల్లో కూడా కీలకంగా ఉన్నాడు. ప్రస్తుతం ఎంసీఏ చిత్ర ఫేమ్ దర్శకుడు శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న “వకీల్ సాబ్” చిత్రంలో కూడా హీరో గా చేస్తున్నాడు. పింక్ హిందీ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ మూవీ ఇప్పటికే చిత్రీకరణ పనులు కూడా పూర్తయినట్లు టాక్. లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడింది. మరో పక్క ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్న “విరూపాక్ష” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇక చిరంజీవి అయితే,.. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న “ఆచార్య” అనే చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు.

లాక్ డౌన్ వేళ తమకు సంబంధించిన ఫోటోలను జ్ఞాపకాలను సోషల్ మీడియాలో హీరో హీరోయిన్స్ పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా మెగా బ్రదర్స్ ముగ్గురికి సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియా మాధ్యమాలలో ప్రస్తుతం అవుతున్నాయి.అయితే ఈ ఫోటోలను గమనిస్తే, ఈ ముగ్గురు అన్నదమ్ములు తమ చిన్నప్పుడు కలిసి తీయించుకున్నవని చెప్పొచ్చు. పవన్ కళ్యాణ్ ని మెగాస్టార్ చిరంజీవి ,నాగబాబు కలిసి ఎత్తుకున్నారు. దీంతో ఈ ఫోటోని మెగా అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. అంతేగాక మెగా బ్రదర్స్ ముగ్గురు ఒక్కటైన వేళ చాలా బాగుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.