Movies

ఎన్టీఆర్ సినిమాల బడ్జెట్,కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒక లుక్ వేయండి

నందమూరి మూడో తరంలో నట వారసుడిగా అడుగుపెట్టి యంగ్ టైగర్ గా దూసుకెళ్తున్న జూనియర్ ఎన్టీఆర్ చూడాలని ఉంది మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. తొలిసినిమా ప్లాప్ అవ్వడంతో నాలుగు కోట్ల బడ్జెట్ కి 50లక్షలు మాత్రమే వచ్చింది. అయితే తర్వాత గ్యాప్ తీసుకుని వచ్చిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీ భారీ హిట్ అందుకుంది. రాజమౌళి తొలిసారి డైరెక్ట్ చేసిన ఈ మూవీకి 1.8కోట్లు ఖర్చవ్వగా, 12కోట్లకు పైనే వసూలు చేసి బ్లాక్ బస్టర్ అయింది. తర్వాత రెండున్నర కోట్ల బడ్జెట్ తో సురేష్ వర్మ డైరెక్షన్ లో వచ్చిన సుబ్బు నాలుగున్నర కోట్లు వసూలు చేసింది. అయినా కమర్షియల్ హిట్ కాలేదు. 2002లో ఆది పేరుతొ వివి వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన సినిమా నాలుగు కోట్ల బడ్జెట్. అయితేనేం 19కోట్లు పైనే కలెక్ట్ చేసింది.

బి గోపాల్ డైరెక్షన్ లో వచ్చిన అల్లరి అల్లుడు యావరేజ్. నాలుగు కోట్ల బడ్జెట్ కి 10కోట్లు పనే వసూళ్లు రాబట్టింది. నాగ మూవీ ప్లాప్ టాక్ వచ్చినా, మార్కులు బాగా పడ్డాయి. నాలుగున్నర కోట్ల బడ్జెట్ అయితే, తొమ్మిదిన్నర కోట్లు వసూలు చేసింది. ఆంధ్రావాలకు 10కోట్లు బడ్జెట్ పెడితే పదికోట్లే వచ్చింది. పూరి జగన్నాధ్ తీసిన ఈ సినిమా 2004లో వచ్చింది. తరవాత వినాయక్ డైరెక్షన్ లో వచ్చిన సాంబ 8కోట్ల బడ్జెట్ తో తీస్తే యావరేజ్ గా నిల్చి 14కోట్లు కలెక్ట్ చేసింది. తరువాత నా అల్లుడు మూవీ 10కోట్లతో తీస్తే 9న్నరకోట్లు కూడా రాలేదు. తరువాత బి గోపాల్ డైరెక్షన్ లో 17కోట్లతో తీసిన నరసింహుడు వర్కవుట్ కాలేదు. 12కోట్లు మాత్రమే వచ్చింది. ఆతర్వాత సురేంద్ర రెడ్డి డైరెక్షన్ లో వచ్చిన అశోక్ కూడా హిట్ కాలేదు. 14కోట్లు పెడితే 15కోట్లు మాత్రమే తెచ్చింది.

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన రాఖీ మూవీ కమర్షియల్ హిట్ కాలేదు కానీ ఎన్టీఆర్ నటనను పీక్ స్టేజ్ కి తీసుకెళ్లింది. 12న్నర కోట్లతో తీస్తే,19కోట్లు వచ్చింది.2007లో ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన యమదొంగ 20కోట్లతో తీస్తే,33కోట్లకు పైనే వచ్చింది. మెహర్ రమేష్ డైరెక్షన్ లో 2008లో వచ్చిన కంత్రీ మూవీకి 18కోట్లు ఖర్చయితే 23కోట్లు వచ్చింది. 22కోట్లతో వినాయక్ డైరెక్షన్ లో తీసిన అదుర్స్ 30కోట్ల పైనే వసూలు చేసింది. 2010లో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన బృందావనం సూపర్ హిట్. 25కోట్లు ఖర్చుచేస్తే, 37కోట్లు పైనే వచ్చింది. 2011లో మెహర్ రమేష్ తీసిన శక్తి మూవీ ప్లాప్. 30కోట్లతో తీస్తే, 21కోట్లు కూడా రాలేదు. తర్వాత సురేంద్రరెడ్డి తీసిన ఊసరవెల్లి యావరేజ్. 25కోట్ల సినిమాకు 30కోట్లు వచ్చింది. 2012లో దమ్ము మూవీ బోయపాటి తీసాడు. 27కోట్లు బడ్జెట్ పెడితే 34కోట్లే వచ్చింది.

శ్రీను వైట్ల 45కోట్లతో భారీగా తీసిన బాద్షా 49కోట్లే తెచ్చింది. ఆతర్వాత రామయ్య వస్తావయ్యా, రభస మూవీస్ దెబ్బతిన్నాయి. పెట్టిన డబ్బులు కూడా రాలేదు. సరిగ్గా అదేసమయంలో2015లో పూరి తీసిన టెంపర్ సూపర్ హిట్. 36కోట్ల బడ్జెట్ కి 49కోట్లు పైనే వసూళ్లు చేసింది. 2016లో సుకుమార్ డైరెక్షన్ లో40కోట్లతో నాన్నకు ప్రేమతో 56కోట్లు పైనే వసూలు చేసింది. అదే ఏడాది కొరటాల శివ తీసిన జనతా గారేజ్ బ్లాక్ బస్టర్ గా నిల్చి 45కోట్లకు గాను 85కోట్లు పైనే తెచ్చింది. కె ఎస్ రవీంద్ర 2017లో తీసిన జై లవకుశ సూపర్ హిట్ కొట్టి,45కోట్లకు గాను 83కోట్లు తెచ్చింది. ఇక మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తొలిసారి తీసిన అరవింద సమేత వీర రాఘవ మూవీ కి 100కోట్లు ఖర్చు. బ్లాక్ బస్టర్ కొట్టి, 193కోట్లు పైనే వసూలు చేసింది.