Movies

ఎన్టీఆర్ బ్రాండ్ విలువ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

యంగ్ టైగర్ ఎన్టీఆర్ చాలా సైలెంట్ గా ఒక్కో బ్రాండ్ ని తన ఖాతాలో వేసుకుంటూ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుకుంటున్నాడు. సినిమాలే కాకుండా బ్రాండ్ ల ద్వారా కూడా ఎన్టీఆర్ బాగానే వెనకేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ గతంలో నవరతన్ హెయిర్ ఆయిల్.. అప్పీ ఫిజ్ వంటి వివిధ బ్రాండ్లకు అంబాసిడర్ గా ఉన్నారు. సెలెక్ట్ మొబైల్స్ కి ప్రచారకర్తగా కొనసాగారు. ఇటీవల ఒట్టో అనే బట్టల బ్రాండ్ కు అంబాసిడర్గా సంతకం చేశారు. ఆ బ్రాండ్ టీవీ ప్రకటన ప్రచారం వేడెక్కించింది. ఆర్.ఆర్.ఆర్ చిత్రీకరణ సమయంలోనే ఈ యాడ్ ని షూట్ చేశారు.

అలాగే ప్రఖ్యాత సెలెక్ట్ మైబైల్ ఫ్రాంఛైజీల విస్తరణకు కూడా తారక్ ప్రమోషన్ ఓ రేంజులోనే ఉంటుందని సమాచారం. ఈ నెల 17 న విజయవాడలో సెలెక్ట్ మైబైల్ కొత్త శాఖను ప్రారంభిస్తున్నారని సమాచారం. విజయవాడలో కరోనా ఉదృతి చాలా ఎక్కువగా ఉండుట వలన ఎన్టీఆర్ ప్రత్యేకించి ఓ చార్టెడ్ ఫ్లైట్ లో వచ్చి ఓపెన్ చేస్తాడని సమాచారం ఉంది. ఆ క్రమంలోనే తారక్ కి సెక్యూరిటీ విషయమై తగు జాగ్రత్తలు తీసుకోనున్నారని తెలుస్తోంది.