Movies

ఈ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే మిస్ కాకూండా చూసేయండి

గతంలో కొందరు హీరోయిన్స్ మేకప్ లేకుండా నటించేవారట. ఇప్పుడు షూటింగ్ లేకున్నా మేకప్ ఉండాల్సిన పరిస్థితి. ఇక టాలీవుడ్ రౌడి విజయ్ దేవర కొండ సరసన “టాక్సీవాలా” చిత్రంలో నటించి తెలుగు ప్రేక్షకులను బాగా అలరించిన రాయలసీమ బ్యూటీ ప్రియాంక జవాల్కర్ గుర్తుందా? యంగ్ దర్శకుడు రాహుల్ ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. అయితే ఈ అమ్మడు వచ్చీ రావడంతోనే తన అందం, నటనతో ప్రేక్షకులని కట్టిపడేసింది.

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రియాంక జవాల్కర్ తన మొదటి చిత్రంతో పర్వాలేదనిపించినా కొత్త సినిమా అవకాశాలను దక్కించుకోవడంలో మాత్రం ఎందుకో తడబడుతోంది.తన టాక్సీ వాలా చిత్రం విడుదలై రెండు సంవత్సరాలు కావస్తున్నా… ఇప్పటికీ తన తదుపరి చిత్రం గురించి ప్రియాంక జవాల్కర్ నుంచి ఎలాంటి అప్డేట్ లేదు.

కాగా ఇటీవలే ఈ అమ్మడు ఓ టాలీవుడ్ యాంగ్ దర్శకుడు దర్శకత్వం వహిస్తున్న “గమనం” అనే చిత్రంలో నటించే అవకాశం దక్కించుకున్నట్లు టాక్.అయితే తాజాగా ఈ అమ్మడికి సంబంధించినటువంటి ఓ ఫోటో సోషల్ మీడియా మాధ్యమాలలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఈ ఫోటో ఓసారి గమనిస్తే, .. ఈ సినిమాల్లోకి రాక ముందు ప్రియాంక జవాల్కర్ ఎలా ఉండేదో మనకి స్పష్టంగా అర్ధం అవుతుంది. అయితే ఫోటో విషయమై అప్పట్లో ప్రియాంక జవాల్కర్ స్పందిస్తూ ఆ ఫోటో తనదేనని సినిమాల్లోకి రాక ముందు కాలేజీలో చదివే రోజుల్లో తీసుకున్న ఫోటోగా చెప్పింది. అయితే ఆ ఫోటో ఎలా బయటికి వచ్చిడ తనకీ అర్థం కావడం లేదని కూడా తన అధికారిక సోషల్ మీడియా ద్వారా తెలిపింది. మొత్తానికి ఈ ఫోటో ఇప్పటికీ బాగా వైరల్ అవుతోంది.