Movies

ఈ బాల నటుణ్ని గుర్తు పట్టారా…ఇప్పుడు ఏమి చేస్తున్నాడో తెలుసా ?

చైల్డ్ ఆర్టిస్ట్ లుగా దుమ్మురేపిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కొందరు పెద్దయ్యాక హీరోలుగా, హీరోయిన్స్ గా అదరగొట్టినవాళ్ళూ ఉన్నారు. నిజానికి చిన్నతనంలో వీళ్ళు చేసే నటన అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇక డీజే దువ్వాడ జగన్నాధం మూవీలో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తున్నాడా? అతడు ఇప్పుడు హీరోగా వస్తున్నాడని సోషల్ మీడియా కోడై కూస్తోంది.

కేడి సినిమాతో కెరీర్ ఆరంభించి కేడి పిల్లోడిలా నిల్చిన ఈ కుర్రాడు పేరు సాత్విక్ వర్మ. ఆరేళ్ళ వయస్సులో రెండో తరగతి చదువుతుండగా ఎంట్రీ ఇచ్చి, డీజే, శ్రీవల్లీ, అజ్ఞాత వాసి, గోలీమార్,కేశవ, ఆటాడుకుందాం రా,ఇలా పదేళ్లలో 80మూవీస్ చేసాడు.

బాహుబలి,రేసుగుర్రం లాంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా మంచి గుర్తింపు పొందాడు. అయితే సడన్ గా సినిమాల్లో కనిపించడం లేదు. ఎందుకని ఆరాతీస్తే, ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా హ్యాండ్సమ్ గా మారిపోయాడు. హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడట. లాక్ డౌన్ పిరియడ్ లో హీరోగా అవ్వడానికి అవసరమైన కసరత్తులు పూర్తిచేసాడని అంటున్నారు. మరి యంగ్ హీరోగా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో చూడాలి.