నెట్ ఫ్లెక్స్ Vs అమెజాన్ ప్రైమ్….ఈ రెండింటిలో ఎవరిదీ పైచేయి…చూడండి
ఇన్నాళ్లూ వెండితెరమీద బాక్సాఫీస్ వార్ నడిస్తే, కరోనా కాలంలో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కీలకంగా మారాయి. ముందునుంచే ఓటిటి ఫ్లాట్ ఫామ్ ఉన్నప్పటికీ లాక్ డౌన్ తో సినిమా హాల్స్ మూసెయ్యడం,షూటింగ్స్ లేకపోవడం వంటి కారణాలతో షూటింగ్ పూర్తిచేసిన సినిమాలను ఓటిటిలో రిలీజ్ చేయడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధం అవుతున్నారు. నిజానికి ఓటిటి ఫుల్ ఫామ్ లోకి రావాలంటే కనీసం అయిదు నుండి పది సంవత్సరాలు పడుతుందని అనుకున్నా…. కరోనా కారణంగా థియేటర్లు మూత పడి నాలుగు నెలలు అవుతుంది. మరికొన్నాళ్ల పాటు ఇదే పరిస్థితి కనిపించే అవకాశం ఉంది. అందుకే ఇప్పుడే ఓటీటీ ప్లాట్ ఫామ్స్ బిజినెస్ విపరీతంగా పెరగడమే కాదు, తీవ్ర పోటీ కూడా వచ్చేసింది. అందుకే నెట్ ప్లిక్స్, అమెజాన్ మధ్య వార్ సాగుతోంది.
మొన్నటి వరకు ఓటీటీ లకు పాత సినిమాలకు కేంద్రం అయిన ఇవి ఇప్పుడు కొత్త సినిమాలను వరుసగారావడంతో ఇప్పుడు ఆరెండు ఓటిటి లతో పాటు జీ5 ,హాట్ స్టార్ ఇంకా మరి కొన్ని కూడా అన్ని భాషల మూవీస్ భారీ మొత్తాలకు కొనుగోలు చేసి విడుదల చేసేందుకు సిద్దంగా ఉన్నాయి. మరోపక్క మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కూడా ఆహా పేరిట ఓటిటి తెరిచారు. అయితే ముఖ్యంగా నెట్ ప్లిక్స్ , అమెజాన్ ప్రైమ్ వీడియోల మద్య కొత్త సినిమాల కొనుగోలు విషయంలో పోటీ తారా స్థాయికి చేరింది. కోట్ల పెట్టుబడి పెట్టి సినిమాలను ఈ ఓటీటీలు కొనుగోలు చేయడం విశేషం.
గుంజన్ సక్సేనా, తొర్భాజ్, డాలీ కిట్టి ఔర్ వో, లూడో, క్లాస్ ఆఫ్ 83, గన్నీ వెడ్స్ సన్నీ, మిస్ మ్యాచ్డ్, ఏకే వర్సెస్ ఏకే, సీరియస్ మెన్, భాగ్ మినీ భాగ్, బాంబే బేగమ్స్ ఇంకా కొన్ని సినిమాలతో పాటు మొత్తం 17 సినిమాలను విడుదల చేయబోతున్నట్లుగా నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటించింది. వాటిని వారంకు ఒక్కటి రెండు చొప్పున ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాల కోసం నెట్ ప్లిక్స్ భారీ మొత్తం ఇచ్చిందని టాక్. ఈ సినిమాల స్ట్రీమింగ్ తో తమ వినియోగదారుల సంఖ్య 20 నుండి 25 శాతం వరకు పెరిగే అవకాశం ఉందని నెట్ ప్లిక్స్ అంచనా. ఇదే సమయంలో అమెజాన్ ప్రైమ్ వీడియో కూడా పది సినిమాలను కొనడానికి సిద్ధం అయిందట.