చిరు తల్లిగా నటించిన ఈ నటిని గుర్తు పట్టారా…ఈమె పెళ్లి చేసుకోకపోవటానికి కారణం…?
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బ్లాక్ బస్టర్ కొట్టిన శంకర్ దాదా ఎంబిబిఎస్ మూవీ లో చిరు తల్లిగా నటించిన నటి వెన్నెరాడై నిర్మల. అంతకుముందు చాలా సినిమాల్లో నటించి మెప్పించిన ఈమె అసలు పేరు శాంతి. అయితే ఇండస్ట్రీలోకి వచ్చాక నిర్మలగా మార్చుకుంది. 1948జూన్ లో తమిళనాట జన్మించిన ఈమె చిన్ననాటి నుంచి భరతనాట్యం నేర్చుకుని దేశం మొత్తం ప్రదర్శనలు ఇచ్చింది.
అయితే ఈమె తమిళియన్ అయినప్పటికీ తమిళం,తెలుగు,మలయాళం,కన్నడం ఇలా అన్ని భాషల్లో నటించిన ఈమె ఒకప్పుడు హీరోయిన్ గా అదరగొట్టింది. దాదాపు 200సినిమాల్లో నటించిన ఈమె సివి శ్రీధర్ డైరెక్షన్ లో వచ్చిన వెన్నెరాడై మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ఈమె పేరు వెన్నెరాడై నిర్మలగా మారింది.
సోషల్ మీడియాకు దూరంగా ఉండే వెన్నెరాడై నిర్మల ఎక్కువగా బయటకు కూడా రాదు. అయితే ఆమె సన్నిహిత వర్గాల ద్వారా ఓ విషయం ఈమధ్య వైరల్ అవుతోంది. అదేమిటంటే, ఇక అప్పట్లోనే ఓ తమిళ హీరోని ప్రేమించినప్పటికీ పెళ్లివరకూ వెళ్లకపోవడంతో ఇప్పటివరకూ వెన్నెరాడై నిర్మల పెళ్లి చేసుకోలేదని టాక్.