పవన్ కి ఆర్ధిక ఇబ్బందులు ఎప్పుడు ఉంటాయట…కారణాలు అవేనట…ఇలా అయితే ఎలా ?
మెగా బ్రదర్స్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భిన్నమైన శైలి. మెగాస్టార్ ఆధారంగా ఇండస్ట్రీకి వచ్చినప్పటికీ తన టాలెంట్ తో పవర్ స్టార్ అయ్యాడు. సినిమా సినిమాకి రేంజ్ పెంచుకుంటూ తన మార్క్ చూపిస్తున్నాడు. అంతేకాదు టాప్ లెవెల్లో రెమ్యునరేషన్ కూడా అందుకుంటూనే ఉంటాడు. అయినా ఎప్పుడూ ఆర్ధిక సమస్యలు వెంటాడుతూనే ఉంటాయి.
దీనికి కారణం ఏమిటని ఆరాతీస్తే,పవన్ కి అంత్యంత సన్నిహితంగా ఉండే నిర్మాత శరత్ మరార్ చెప్పిన మాట ప్రకారం డబ్బు విషయంలో పెద్దగా శ్రద్ధ వహించకపోవడమే దీనికి కారణమని తెలుస్తోంది. ‘జానీ సమయంలో పవన్ తో పరిచయం ఏర్పడింది. అల్లు అరవింద్ రిక్వెస్ట్ తో ఆ సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఉండడానికి ఒప్పుకున్నా’అని ఆయన ఓ ఇంటర్యూలో చెప్పారు.
అప్పటినుంచి పవన్ తో సన్నిహితంగా ఉంటున్నానని శరత్ మరార్ అంటున్నారు. డబ్బు ఉంటె చాలు, ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటె వెంటనే సాయం చేసే గుణం పవన్ లో ఉందని, అందుకే ఎంత సంపాదించినా ఏమీ మిగలదని చెప్పారు. కాగా పవన్ ఆర్ధిక సమస్యల కారణంగానే రేణు దేశాయ్ కూడా విడాకులు తీసుకున్నట్లు అప్పట్లోనే వార్తలు వైరల్ అయ్యాయి.