Movies

ఈ విలన్ ని గుర్తు పట్టారా…టాప్ హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నాడు

అంజలా జావేరీ ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోల సరసన నటించి ఒక వెలుగు వెలిగింది. మొదటి హిందీలో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. హిందీలో పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులో సినిమాలు చేసిన రావాల్సినంత క్రేజ్ రాలేదు. తెలుగులో వెంకటేష్ హీరోగా నటించిన ప్రేమించుకుందాం రా అనే సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కావటంతో తెలుగులో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. నాగార్జున,బాలకృష్ణ వంటి హీరోలతో జోడి కట్టిన ఆమెకు అనుకున్నంత క్రేజ్ రాలేదు.

ఆమెకు అభినయం ఉన్నా అదృష్టం కలిసి రాలేదు. ఆ తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. ఇక 2012 లో వచ్చిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో ఒక పాత్ర పోషించింది. అదే తెలుగులో చివరి సినిమా.ఆ తర్వాత ఆమె పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్ బై చెప్పేసింది. ఆమె ‘తరుణ్ అరోరా’ ను వివాహం చేసుకుంది. అతను కూడా హిందీ, తమిళ్ లో చాలా సినిమాల్లోనే నటించారు.

చిరంజీవి 150 వ సినిమా ఖైదీ నెం. 150 , పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కాటమరాయుడు రెండు సినిమాల్లోనూ విలన్ గా నటించాడు. ఈ సినిమాల్లో మంచి పేరు సంపాదించాడు.ఆయన జయ జానకి నాయక సినిమాలో కూడా విలన్ గా నటించాడు. తరుణ్ తన కెరీర్ ని 1999 లో ప్రారంభించిన ఖైదీ నెం. 150 తో బ్రేక్ వచ్చిందనే చెప్పాలి.అమర్ అక్బర్ ఆంటోని,అర్జున సురవరం సినిమాలలో కూడా నటించాడు.