Movies

ఈ ఫొటోలో ఉన్న టాప్ యాంకర్ ని గుర్తు పట్టారా…అయితే ఆలస్యం చేయకుండా వెంటనే చూసేయండి

ఓ పక్క బుల్లితెర,మరోపక్క వెండితెరపై తన సత్తా చాటుతున్న యాంకర్ అనసూయ అనగానే జబర్దస్త్ కామెడీ షో గుర్తొస్తుంది. అలాగే పలు చానల్స్ లో షోస్ కూడా చేస్తోంది పలు ఈవెంట్స్ లో కూడా ఉంటోంది. తెలుగులోనే కాదు ఇతర భాషా ఛానల్స్ లో కూడా షోస్ చేస్తోంది.

సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన రంగస్థలం మూవీలో రంగమ్మత్త పాత్రలో ఆడియన్స్ మతిపోగోట్టిన ఈ అమ్మడు ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య మూవీలో కీలక పాత్ర కూడా పోషిస్తోంది. అలాగే రొమాంటిక్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ తెరెకెక్కిస్తున్న ఫైటర్ మూవీలో కూడా అనసూయ ఓ కీలక రోల్ పోషిస్తోందని టాక్.

తన అందచందాలతో ఆడియన్స్ ,నెటిజన్స్ ని ఆకట్టుకునే అనసూయ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా అనసూయకు చెందిన ఓ ఫోటో తెగ వైరల్ అవుతోంది. బహుశా తనతల్లి తనను ఎత్తుకుని ఉన్నప్పటి ఫోటో కావచ్చు. అందుకే నెటిజన్స్ ‘అనసూయ ఎంత క్యూట్ గా ఉందొ’అని కామెంట్స్ పెడుతూ,షేర్ చేస్తున్నారు.