Health

ఇమ్మ్యూనిటి(రోగనిరోధక శక్తి) కోసం ఈ పండ్లు తప్పనిసరి…మీరు తింటున్నారా…?

వానాకాలం వచ్చేసింది. ఈ కాలంలో ఈ పండ్లను తీసుకుంటే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే ఎటువంటి వైరస్ లు బారిన పడకుండా ఉంటారు. ప్రసుతం నేరేడు పండ్లు చాలా విస్తృతంగావస్తున్నాయి . నేరేడు పండ్లలో ఐరన్, ఫైబర్, పొటాషియం విటమిన్లు సమృద్ధిగా ఉంటాయి. ఇవి డయాబెటిస్ ఉన్నవారికి చాలా మంచిది. రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే రక్తంలో చక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. బరువు తగ్గాలని అనుకునేవారికి కూడా మంచి ఫ్రూట్.

వానాకాలంలో జీవక్రియల రేటు మందకొడిగా ఉండుట వలన శరీరం చురుగ్గా ఉండదు. కాబట్టి రోజుకొక ఆపిల్ తింటే జీవక్రియలు బాగా జరిగి ఉషారుగా ఉంటాం. శరీరంలో రోగనిరోధక శక్తి పెరగాలంటే దానిమ్మ తీసుకోవాలి. విటమిన్ సి అధికంగా ఉన్న బొప్పాయి కూడా శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే బొప్పాయిలో పీచు ఉండటం వలన వానాకాలంలో వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. అరటి పండులో విటమిన్లు, మినరల్స్ ఉండుట వలన తక్షణ శక్తి లభిస్తుంది.