బిగ్ బాస్ లోకి క్రేజీ సింగర్…ఎవరో తెలుసా ?
బిగ్ బాస్ సీజన్ 4 త్వరలో స్టార్ మాలో రాబోతుంది. లాక్ డౌన్ సమయంలో తెలుగు ప్రేక్షకులను అలరించటానికి స్టార్ మా నిర్వాహకులకు మంచి అవకాశం అని చెప్పవచ్చు. నాగార్జున హోస్ట్ గా చేస్తున్నాడు. బిగ్ బాస్ లో పాల్గొనే వారి లిస్ట్ ఇది అంటూ చాలా పేర్లు హల్ చల్ చేస్తున్నాయి. శ్రద్ధా దాస్, హంసా నందిని, యామిని భాస్కర్ మరియు రఘు మాస్టర్ బిగ్ బాస్ 4లో ఉన్నట్టు ఇన్ సైడ్ టాక్.
తాజాగా ఈ లిస్టులో తెలంగాణ ఫోక్ సింగర్ మంగ్లీ పేరు కూడా చేరింది. తెలంగాణ పండగలు, సంప్రదాయాలను పాటగా చెప్పడంలో మంగ్లీ ఫేమస్. ఇప్పుడు ఈ తెలంగాణ పోరి బిగ్ బాస్ లోకి రానున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన 3 సీజన్లలో కల్పనా, గీత మాధురి మరియు రాహుల్ సిప్లిగంజ్ వంటి సింగర్లు కంటెస్ట్ చేసారు. ఎన్ని వార్తలు వచ్చిన,ఎన్ని పేర్లు హల్ చల్ చేసిన అన్ని ఊహాగానాలే. బిగ్ బాస్ 4 సీజన్ మొదలు అయ్యేవరకు ఇలా పేర్లు వినపడుతూనే ఉంటాయి.