ఈ హీరో ఎవరో తెలిస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు
ప్రేమ కథలు చేస్తూ లవర్ బాయ్ ఇమేజ్ తో ముందుకు దూసుకువెళ్ళుతున్న నాగ సూర్య “అశ్వద్ధామ” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నించిన వర్క్ అవుట్ కాలేదు. “అశ్వద్ధామ” సినిమాకి కథ కూడా నాగ సూర్య అందించాడు. ప్రస్తుతం నాగ శౌర్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా కోసం వర్కవుట్లు చేసి, జిమ్ లో గంటల కొద్దీ కష్టపడి కండలు పెంచి ఒక ప్రొఫెషనల్ అథ్లైట్ లా మారాడు. ఈ సినిమాకి సంబంధించిన ప్రీ లుక్ బయట పెట్టారు. ఈ లుక్ చూసి దాదాపుగా అందరు ఆశ్చర్యపోయారు. ఫస్ట్ లుక్ సోమవారం ఉదయం 9 గంటలకు శేఖర్ కమ్ముల చేతుల మీదుగా విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.