Movies

తమన్నా కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు

టాలీవుడ్ లో మిల్కీ బ్యూటీగా పేరుగాంచిన తమన్నా 2005లో సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది. ముంబయిలో 1989 డిసెంబర్ 21న ముంబయిలో పుట్టిన తమన్నా స్టడీ అంతా అక్కడే జరిగింది. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన హ్యాపీ డేస్ మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన తమన్నా తొలిసారి మంచు మనోజ్ హీరోగా వచ్చిన శ్రీ లో నటించింది. పైగా ఇది 2005లో రిలీజయి గుర్తింపు కూడా రాలేదు. తరవాత తెలుగు, తమిళంలో కూడా ఎన్నో ఛాన్స్ లు వచ్చినా 2007లో వచ్చిన హ్యాపీ డేస్ తోనే గుర్తింపు వచ్చింది. తర్వాత తమిళంలో చేసిన సినిమా భారీ హిట్ ఇచ్చింది.

కెరీర్ లో53సినిమాలు చేయగా, అందులో మూడు బ్లాక్ బస్టర్స్, సూపర్ హిట్ ఒకటి,హిట్లు 5, ఏవరేజ్ లు 8,ప్లాప్ లు 17గా ఉన్నాయి. ఇక సుశాంత్ హీరోగా వచ్చిన కాళిదాసు ప్లాప్ అయింది. ఆతర్వాత తెలుగు ,తమిళ భాషల్లో వరుస సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. 2007లో తమిళంలో సూర్య నటించిన సినిమాలో తమన్నాకు మంచి పేరు వచ్చింది. ఇక సిరి తో మూవీ తమిళంలో భారీ హిట్ కొట్టింది. 2011లో 100%లవ్ మూవీ తెలుగులో సూపర్ హిట్ ఇచ్చింది. అదే ఏడాది వచ్చిన బద్రీనాధ్ ప్లాప్ గానే నిల్చింది. అలాగే ఊసరవెల్లి ఏవరేజ్ అయింది.

ఇక 2012లో వచ్చిన ఎందుకంటే ప్రేమంట,రెబెల్ మూవీస్ ఏవరేజ్ గా నిలిచాయి. పవన్ కళ్యాణ్ తో జోడీ కట్టి,కెమెరామెన్ గంగతో రాంబాబు మూవీ ఏవరేజ్ గానే నిల్చింది. ఆతర్వాత హిందీలో హిమ్మత్వాల అని వచ్చినా బడ్జెట్ పరంగా విజయం వచ్చినా పేరు మాత్రం రాలేదు. తడాఖా, అల్లుడు శ్రీను , ఆగడు వంటి మూవీస్ అన్నీ ప్లాప్స్ తెచ్చాయి. తమిళంలో మంచి సినిమాలు వచ్చాయి. అల్లుడు శ్రీను,జై లవకుశ వంటి సినిమాల్లో ఐటెం సాంగ్స్ తో అదరగొట్టింది. తెలుగులో వరుసగా బెంగాల్ టైగర్స్,వంటి సినిమాలు చేసినా బాహుబలి ఆల్ టైం రికార్డ్ ఇచ్చింది. బాహుబలి ఆల్ టైం రికార్డ్ క్రియేట్ చేసింది.