వైభవంగా నితిన్ పెళ్లి…నితిన్ కుర్తా ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?
ఎంతో ఘనంగా పెళ్లి చేసుకోవాలని నిర్ణయించినప్పటికీ కరోనా మహమ్మారి నేపథ్యంలో పరిమిత సంఖ్యలోనే పెళ్లి చేసుకోవాల్సి రావడంతో టాలీవుడ్ యువ హీరో నితిన్ – షాలినిల వివాహ వేడుక ఆదివారం రాత్రి హైదరాబాద్ లోని ఫలక్ నుమా ప్యాలెస్ లో వైభవంగా జరిగింది. ప్రస్తుత పరిస్థితులు పెట్టుకొని ఇరు కుటుంబాలు ఈ వివాహానికి కొద్ది మంది అతిథులను మాత్రమే ఆహ్వానించారని టాక్.
తన దీర్ఘకాల స్నేహితురాలు షాలినితో తన నివాసంలో నిరాడంబరంగా నితిన్ ఇటీవల ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఈ నిశ్చితార్ధ వేడుక ఫోటోలను నితిన్ సోషల్ మీడియా మాధ్యమాలలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. ఈ ఫొటోలో నితిన్ క్రీమ్ కలర్ సంప్రదాయ కుర్తా పైజమా ధరించగా.. షాలిని బంగారు రంగు పట్టుచీరలో కనిపించారు. అయితే నితిన్ ఎంగేజ్మెంట్ నాడు ధరించిన కుర్తా పైజామా ధర తెలుసుకొని ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు.
పెళ్లి పనులు స్టార్ట్ అయినప్పటి నుంచి రకరకాల దుస్తుల్లో దర్శనమిచ్చిన నితిన్ నిశ్చితార్ధ వేడుక కోసం 67 వేల200 రూపాయల ఖరీదు గల కుర్తా ధరించారు. ప్రముఖ డిజైనర్ అభినవ్ మిశ్రా ఎస్.ఎస్20 కలెక్షన్స్ నుంచి ఈ కుర్తాను తీసుకున్నారని అంటున్నారు. అందుకే ప్రస్తుతం నితిన్ ఎంగేజ్మెంట్ కుర్తా ధర గురించే అందరూ మాట్లాడుకుంటున్నారు. దటీజ్ నితిన్ అంటున్నారు.