Movies

దగ్గుబాటి వారబ్బాయి పెళ్లి స్పెషల్ ఏమిటో తెలిస్తే అవ్వాలసిందే

పూర్వం పెళ్లికాని వాళ్ళను పెళ్లికాని ప్రసాద్ అనేవారు. కానీ టాలీవుడ్ లో కూడా పెళ్లికాని ప్రసాద్ లు చాలామంది ఉన్నా, ప్రస్తుతం పెళ్లిళ్ల తంతు జోరుగా సాగుతోంది. ఇప్పటికే హీరో నిఖిల్ సిద్ధార్థ్ , స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజుల వివాహాలు జరిగిపోగా యువ హీరో నితిన్ వివాహం కూడా నిన్నజరిగిపోయింది . ఈ నేపథ్యంలోదగ్గుబాటి వారబ్బాయి, బాహుబలితో భల్లాలదేవుడు గా పాపులర్ గా మారిన దగ్గుబాటి రానా కూడా బ్యాచిలర్ లైఫ్ కి గుడ్ బై చెప్పి ఓ ఇంటివాడు అవుతున్నాడు.బంటీ – సురేష్ బజాజ్ దంపతుల కుమార్తె అయిన మిహీకా బజాజ్ ను రానా ప్రేమ వివాహం చేసుకోబోతున్నాడు.

ఇటీవల దగ్గుబాటి రానా – మిహీకా బజాజ్ ల రోకా వేడుకను ఇరు కుటుంబాలు కలిసి నిర్వహించారు. ఇక ఆగస్టు 8న శుభముహూర్తాన రానా – మిహీకాల వివాహం వైభవంగా జరిపించడానికి ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి కుటుంబ సభ్యులు కొద్దిమంది సన్నిహితులు అతిథుల సమక్షంలోనే రానా వివాహ వేడుక ఉంటుంది.

రానా – మిహీకాల వివాహం ప్రతిష్టాత్మకమైన తాజ్ ఫలక్ నుమా ఫ్యాలెస్ లో జరగనుంది. పెళ్లి వేడుక కోసం ఇప్పటికే మూడు రోజులకి ఈ హోటల్ ని బుక్ చేసుకున్నారని టాక్ . అంతేకాకుండా మార్వాడీ ,హైదరాబాదీ వంటకాలను సిద్ధం చేయడానికి ఇండియాలోనే ఫేమస్ చెఫ్ లను ఈ వివాహానికి పిలిపిస్తున్నారట. స్వతహాగా వెడ్డింగ్ ప్లానర్ అయిన మిహికా బజాజ్ తన పెళ్లిని కూడా రాయల్ థీమ్ తో డిజైన్ చేస్తోందట.