యోగా భామ‘సూపర్’ నుంచి నిశ్శబ్దం వరకు సాగిన సినీ ప్రస్థానం
స్టార్ హీరోయిన్ అనుష్క తాజాగా చేసిన నిశ్శబ్దం మూవీ లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ విడుదల వాయిదా పడింది. స్వీట్ అనుష్క సూపర్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది. నాగార్జున తో నటించిన ఈ మూవీ అంతగా సక్సెస్ కాకపోవడంతో ఆమె భవితవ్యం ఏమిటన్న ప్రశ్న తలెత్తింది. జులై 22నాటికీ ఈమె ఎంట్రీ ఇచ్చి 15ఏళ్ళు పూర్తయ్యాయి. అయితే అరుంధతి లాంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకుని బాహుబలితో వరల్డ్ వైడ్ గుర్తింపు తెచ్చుకుంది. ఎస్ ఎస్ రాజమౌళి తీసిన విక్రమార్కుడు మూవీతో బ్లాక్ బస్టర్ అనుకున్న అనుష్క ఆతర్వాత వెనక్కి తిరిగి చూడలేదు.
లక్ష్యం,సౌర్యం,అరుంధతి, వేదం,రగడ, మిర్చి,బాహుబలి, రుద్రమదేవి,భాగమతి సినిమాలతో తన సత్తా చాటిన యోగా భామ అనుష్క సౌత్ ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ కి చేరింది. ఇక సైజ్ జీరో మూవీ కోసం ఎంత రిస్క్ తీసుకుందో ఆతర్వాత మళ్ళీ తీగలా మారడానికి ఎంతగా కష్టపడిందో అందరికీ తెల్సిందే. టాలీవుడ్ లో ఒకప్పుడు విజయశాంతి లేడి ఓరియెంటెడ్ పాత్రలతో రాణించి,లేడీ అమితాబ్ గా నిలిస్తే, ఇప్పుడు ఆ ప్లేస్ ని అనుష్క భర్తీ చేసిందని చెప్పవచ్చు. ఇక 38ఏళ్ళ అనుష్క పెళ్లి గురించి ఎన్నో వార్తలు షికారు చేశాయి. ప్రభాస్ తో ప్రేమ పెళ్లి అనే వార్తలు వచ్చినా అవి నిజం కాదని తేలిపోయింది.
ఇక దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు కొడుకు ప్రకాష్ తో పెళ్లి అనే వార్త వచ్చినా అదీ నిజం కాదని తేలింది. కాగా తాజాగా చేసిన నిశ్శబ్దం ( ఇంగ్లీషు వెర్షన్ సైలెన్స్) మూవీ లో మూగ చిత్రకారిణి సాక్షి పాత్రకు అనుష్క అయితేనే కరెక్ట్ అని భావించి అందుకు అనుగుణంగా ఆమెను సెలెక్ట్ చేసారు. కోన వెంకట్ స్క్రిప్ట్ కి అందించగా, ఇందులో హాలీవుడ్ నటులు కూడా నటించారు. హేమంత్ మధుకర్ డైరెక్ట్ చేసిన ఈమూవీలో మాధవన్ నటించాడు. ఇక సీనియర్ స్టార్స్ అందరితో నటించిన అనుష్కకు పవన్ కళ్యాణ్ సరసన ఛాన్స్ రాలేదు. వకీల్ సాబ్ లో తీసుకోవాలని అనుకున్నా,ఆతర్వాత శృతిహాసన్ ని తీసుకోవడంతో ఆ ఛాన్స్ పోయింది.