Movies

ఆగస్టులో థియేటర్స్ ఇలా తెరుస్తారట…మరి ప్రేక్షకులు థియేటర్స్ కి వెళ్ళతారా…?

కరోనా మహమ్మారితో అన్నీ క్లోజ్ అయ్యాయి. ఎంతోమంది ఎంతో నష్టపోయారు. ఇక సినిమా రంగం అయితే చెప్పక్కర్లేదు. లాక్ డౌన్ సడలింపు తర్వాత అన్ లాక్ 1,2లలో కొన్నింటికి మినహాయింపులు ఇచ్చారు. జులై 31తో అన్ లాక్ 2 ముగుస్తున్న నేపథ్యంలో అన్ లాక్ 3 ఆగస్టు నుంచి ప్రారంభం కానుంది. అయితే ఈసారి థియేటర్లు.. జిమ్ లు తెరుచుకునే వీలుంటుందని టాక్. ఇప్పటికే థియేటర్ యజమానులతో కేంద్రం జరిపిన చర్చల్లో 50శాతం సీట్ల సామర్ధ్యంతో అనుమతి ఇవ్వాలని కోరగా, 25శాతం కెపాసిటీ తోనే అనుమతిస్తామని కేంద్రం అంటోందట.

అసలే కేసులు పెరిగిపోతున్న ఈ సమయంలో ఆగస్టు నుంచే థియేటర్లు తెరిచేస్తే, ఆ తర్వాత కోవిడ్ 19 రూల్స్ పాటిస్తూ థియేటర్ యాజమాన్యాలు నడుచుకోవాలి. 50శాతం సీట్లలో జనం కూచోడానికి ప్రభుత్వ నియమం పెట్టినప్పటికీ , కేవలం సగం ఆక్యుపెన్సీతోనే థియేటర్లను నడపడం కష్టమే. కుర్చీల శానిటైజేషన్.. థియేటర్ లో ప్రతి షో తర్వాత శానిటైజేషన్ ఇలా అన్ని ఖర్చులను కలిపితే యాజమాన్యాలకు తడిసిమోపెడు అవుతుంది. దానిని కూడా ప్రేక్షకుడి టిక్కెట్టుపైనే వేసేస్తే ఇక థియేటర్ వైపు చూడ్డానికి జనం జంకుతారు. ఇక కరోనా భయాలతో జనం థియేటర్ల వైపు రాకపోతే పరిస్థితి ఏమిటన్న బెంగా ఉంది.

ఇక థియేటర్ లో ఎవరికైనా కరోనా పాజిటివ్ అని తేలితే ఆ థియేటర్ ని మూసివేయాలనే నిబంధన మర్గదర్శకాల్లో పొందుపరుస్తారట. ఇప్పటికే చాలా ఆలయాలు ఇలాగే మూసేసారు. నిజంగా సినిమా హాల్స్ తెరిస్తే, అనుష్క నిశ్శబ్ధం,- నాని- సుధీర్ ల `వీ`, రానా ఆరణ్య, వైష్ణవ్ తేజ్ ఉప్పెన అలాగే కొందరు రిలీజ్ కోసం క్యూలో ఉన్నారు. మరికొన్ని ఇప్పటికే చిత్రీకరణలు ముగించి నిర్మాణానంతర పనుల్లో ఉండగా.. మరికొన్ని షూటింగ్ దశలో ఉన్నాయి. క్రాక్ , సోలో బ్రతుకే సో బెటర్, శ్రీకారం, లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లాంటి చిత్రాలు సెప్టెంబర్ నాటికి చిత్రీకరణలు పూర్తి చేసుకుని అక్టోబర్ లో దసరా కానుకగా రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నారట.