కళ్యాణ్ రామ్ నిర్మాతలు ఎన్ని కోట్లు నష్టపోయారో…పాపం కళ్యాణ్ రామ్…?
నందమూరి వంశంలో హరికృష్ణ కుమారుడిగా సినిమాల్లో ఎంట్రీ ఇచ్చిన నందమూరి కళ్యాణ్ రామ్ కొన్ని హిట్ మూవీస్ తో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. సినీ నిర్మాణంలో కూడా తనదైన శైలి చూపిస్తున్నాడు. వేణు మల్లిడి డైరెక్షన్ లో ఓ పిరియాడికల్ మూవీ కోసం ఏర్పాట్లు చేసుకున్న నేపథ్యంలో కరోనా మహమ్మారి వచ్చిపడింది.
నాలుగు నెలలైనా కరోనా వదల్లేదు,లాక్ డౌన్ సడలించినప్పటికీ ఇంకా కేసులు పెరగడం వలన షూటింగ్స్ ముందుకి నడవడం లేదు. ఇప్పటికే చాలా సినిమాలు చివరి దశకు రాగా, కొన్ని సినిమాలు మధ్యలో ఉన్నాయి. మరికొన్ని ఇంకా సెట్స్ పైకి రాలేదు. ఇలా వందల కోట్ల రూపాయల నష్టాన్ని నిర్మాతలు చవిచూస్తున్నారు.
అయితే కళ్యాణ్ రామ్ మూవీ కోసం రెండు కోట్ల రూపాయల సెట్ వేసాడు. స్టూడియోలో ఇంత భారీ సెట్ వేసాక లాక్ డౌన్ రావడంతో రెంట్ కట్టాల్సి రావడంతో పెను భారంగా మారింది. దీంతో అద్దె కట్టలేక సెట్ తొలగించాల్సి వచ్చిందట. దీంతో రెండు కోట్ల రూపాయలను రెంట్ కారణంగా నష్టపోవాల్సి వచ్చింది.