Movies

నితిన్ కెరీర్ లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో చూడండి

టాలీవుడ్ లో జయం సినిమాతో ఎంట్రీ ఇచ్చి, తొలిమూవీతోనే బ్లాక్ బస్టర్ అందుకున్న యువ హీరో నితిన్ ఈమధ్యే భీష్మ మూవీతో హిట్ అందుకుని, తాజాగా పెళ్లి కూడా చేసుకున్నాడు. 1983 మార్చి30 న జన్మించిన నితిన్ ఇప్పటిదాకా 23సినిమాలు చేసిన నితిన్ హిట్స్ ,ప్లాప్స్ కూడా చవిచూశాడు. 3సూపర్ హిట్స్ ఉన్నాయి. నిజానికి నితిన్ తండ్రి సుధాకర రెడ్డి ఫిలిం డిస్ట్రిబ్యూటర్ కావడంతో ఈజీగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ తన టాలెంట్ తో స్టార్ హీరోగా ఎదిగాడు.

తేజ డైరెక్షన్ లో 2002లో వచ్చిన జయం సినిమాతో తానేమిటో నిరూపించుకున్న నితిన్ కి తర్వాత వచ్చిన దిల్ మూవీ కూడా భారీ హిట్ అందుకుంది. వివి వినాయక్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన మూవీ ఇది. తరువాత సంబరం మూవీ డిజాస్టర్ గా నిల్చింది. తర్వాత కృష్ణ వంశీ డైరక్షన్ లో శ్రీ ఆంజనేయం మూవీ హిట్ కాకుండా మంచి పేరుతెచ్చిపెట్టింది.

ఇక ఎస్ ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో వచ్చిన సై మూవీ యావరేజ్ గా నిల్చింది. 2005నుంచి 2011వరకు నితిన్ నుంచి వచ్చిన అల్లరి బుల్లోడు ,టక్కరి,ఆటాడిస్తా ,విక్టరీ హీరో, రెచ్చిపో, సీతారాముల కళ్యాణం, మారో లాంటి సినిమాలన్నీ భారీ ప్లాప్ గా నిలిచాయి. 2012లో ఇష్క్ తో హిట్ అందుకున్న నితిన్ 2013లో గుండె జారి గల్లంతయింది మూవీతో మరో హిట్ కొట్టాడు. తర్వాత హార్ట్ ఎటాక్ ప్లాప్ అయింది. చిన్నదానా నీకోసం తో వచ్చి యావరేజ్ అయ్యాడు. 2016లో అ ఆ హిట్ అయింది. తర్వాత లై మూవీ ప్లాప్.