మొగుడు గురించి ప్రియమణి షాకింగ్ కామెంట్స్…ఆలా అనేసిందా ?
సినిమా హీరోయిన్స్ పెళ్లయ్యాక కూడా సినిమాల్లో బాగా రాణిస్తుంటారు. అందుకు అక్కినేని కోడలు సమంత తార్కాణం. అయితే చాలామంది పెళ్ళై ,పిల్లలు పుట్టాక సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తారు. అయితే స్టార్ హీరోయిన్ ప్రియమణి స్టైల్ వేరు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేస్తున్న ‘విరాటపర్వం’ సినిమాలో భారతక్క పాత్ర చేస్తున్న ఆమె మాజీ నక్సలైట్ వద్ద శిక్షణ పొందినట్లు వార్తలు పొక్కాయి. అయితే అలాంటిదేమీ లేదని ఖండించింది.
తన పాత్రకు సంబంధించిన అన్ని వివరాలు డైరెక్టర్ చూసుకుంటున్నారని ప్రియమణి చెప్పుకొచ్చింది. మరోవైపు వెంకటేష్ సరసన ‘నారప్ప’ సినిమాలో డిఫరెంట్ రోల్ పోషిస్తోంది. ఇటీవలే విడుదలైన ఆమె ఫస్ట్‌లుక్ పోస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ రెండు సినిమాల్లో ప్రియమణి నటన చూడాలని సినీ జనాలు ఎదురుచూస్తున్నారు. హీరోయిన్లకు పెళ్లి తర్వాత భర్త సహకారం, అంగీకారం లేదంటే సినిమాల్లో నటించడం కుదరదని,అయితే ఈ విషయంలో తాను అదృష్ట వంతురాలినని చెప్పింది.
నిజానికి చెప్పాలంటే, తనను అర్థం చేసుకునే భర్త దొరికాడని ఆమె చెబుతూ అందుకే పెళ్లైన మూడో రోజునే షూటింగ్ స్పాట్‌కి వెళ్లగలిగానని తెలిపింది. నా మొగుడు బంగారం అని మురిపెంగా చెబుతూ ఆయన కారణంగానే ఇంకా సినిమాల్లో నటిస్తూ మీ అందరినీ అలరిస్తున్నానని వివరించింది. ఇక లాక్‌డౌన్ కారణంగా ఆయనతో బోలెడంత సమయం గడిపానని చెప్పిన ఆమె కుటుంబ జీవితం పట్ల చాలా సంతోషంగా ఉన్నట్లు తెల్పింది. ముంబై డేట్స్ విషయం కూడా తన భర్తనే స్వయంగా చూసుకుంటారని ఆమె తెలిపింది.