వర్షాకాలంలో ఈ కూరలు తప్పనిసరి…మీరు తింటున్నారా
మిగతా సీజన్ లతో పోలిస్తే వర్షాకాలంలో వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువే అని చెప్పాలి. ఈ సమయంలో వైరల్ జ్వరం, మెదడు వాపు, టైఫాయిడ్, డెంగ్యూ అలెర్జీలు వంటివి ఎక్కువగా వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. .అదే సమయంలో రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తిని కూడా బలపరుచుకోవాలి. శరీరంలో రోగనిరోధకశక్తి పెరగాలంటే తప్పనిసరిగా కొన్ని కూరలను తినాలి.
కాకరకాయను తినాలి. చాలా మంది చేదుగా ఉందని తినరు. అయితే కాకర కాయ లో ఉండే విటమిన్ సీ మరియు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఇన్ ఫెక్షన్స్ నుండి రక్షిస్తుంది. జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడి శరీరంలో అదనంగా ఉన్న కొవ్వు కరిగిపోతుంది.
వర్షాకాలంలో తీసుకోవలసిన మరో కూర బీట్ రూట్ . .బీట్‌రూట్‌లో ఉండే ఔషధగుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచటమే కాకుండా ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతుంది.అలాగే బీట్‌రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.గుండె ఆరోగ్యానికి కూడా బీట్‌రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఆనపకాయలో ఉండే ఐరన్, విటమిన్ బీ, విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
https://www.chaipakodi.com/