Movies

షూటింగ్ స్టార్ట్ చేసిన స్టార్ హీరో గుర్తు పట్టారా…ఆలస్యం చేయకుండా చూసేయండి

ఎన్నో వివాదాలు,విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తిచేసుకుని సీజన్ -4కోసం రంగం సిద్ధం చేసుకుంటున్న సమయంలో కరోనా వచ్చింది. అయితే షూటింగ్స్ కి కొన్ని షరతులతో అనుమతి ఇవ్వడంతో కొన్ని సీరియల్స్ ,షోస్ మొదలయ్యాయి. అయితే అగ్ర హీరోలు ఇంకా ఎంట్రీ ఇవ్వలేందను కుంటున్న సమయంలో కింగ్ నాగార్జున యాక్షన్ ,స్టార్ట్,కెమెరా అంటూ వచ్చేసాడు. అవును, బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌-4 ఎప్పుడు ప్రారంభమవుతుందా అని బుల్లితెర ప్రేక్షకులు ఎదురుచూస్తున్న సమయంలో బ్యాక్ ఆన్ ది ఫ్లోర్ విత్ లైట్, కెమెరా యాక్ష‌న్ అంటూ నాగార్జున ఓ ట్వీట్ చేశారు.

అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ బిగ్‌బాస్ నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే ప్రారంభ‌మ‌వు తుంద‌ని, వ్యాఖ్యాత‌గా నాగార్జున వ్య‌వ‌హ‌రించ‌నున్న‌ట్లు స్టార్‌మా సైతం ఇప్పటికే ప్ర‌క‌టించింది. అన్నపూర్ణ స్టూడియోలో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుని మరీ ప్రోమోను లాంచ్ షూటింగ్ లో నాగ్ పాల్గొన్నట్లు తెలుస్తోంది. నిజానికి బిగ్‌బాస్ 3 వ్యాఖ్యాత‌గా నాగార్జున త‌న‌దైన శైలిలో షో ర‌క్తి కట్టించడంతో ఈసారి కూడా నాగార్జునే హోస్ట్ చేసారు. హోస్ట్‌గా పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నప్పటికీ.. నిర్వాహకులు మాత్రం నాగార్జున వైపే మొగ్గు చూపారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలు అనుగుణంగా షూటింగ్‌ చేయడం అనేది నిర్వహకులు సవాలుతో కూడుకున్న పనే. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఫిజికల్‌ టాస్క్‌లు లేకుండా.. షోను డిఫరెంట్‌గా ఏమైనా ప్లాన్‌ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది. మరోవైపు బిగ్‌బాస్ సీజ‌న్-4లో కంటెస్టెంట్‌లు ఎవ‌రన్న దానిపై ఆస‌క్తి నెలకొంది. ఇక నాగార్జున షూట్ కి రావడంతో మిగిలిన హీరోలు ఏమి చేస్తారో చూడాలన్న మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా కరోనా వాక్సిన్ వచ్చేవరకూ చాలా ఇబ్బందే.