శుభలేఖ సుధాకర్ ,శైలజ జీవితంలో కష్టాలు పడటానికి కారణం ఎవరో తెలుసా ?
చిరంజీవి,సుమలత జంటగా కె విశ్వనాధ్ డైరెక్షన్ లో వచ్చిన శుభలేఖ సినిమాలో సుధాకర్,తులసి మరో జంటగా నటించారు. ఇక ఈ సినిమాతో అదే ఇంటిపేరుగా ప్రచారంలోకి వచ్చిన శుభలేఖ సుధాకర్ 1960నవంబర్ 19న జన్మించారు. మంత్రిగారి వియ్యంకుడు,ప్రేమించు పెళ్లాడు చిత్రాల్లో జంటగా నటించారు. ఎన్నో సినిమాల్లో నటించిన శుభలేఖ సుధాకర్ ఇక బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి ఎన్నో సీరియల్స్ లో నటించి తన నటనతో అందరికీ మరింత దగ్గరయ్యాడు.
ఇక గానగంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం సోదరి ఎస్పీ శైలజను వివాహమాడిన శుభలేఖ సుధాకర్ రెండుజళ్ళ సీత, సితార,మొగుడు పిల్లలు,స్వాతి లేడీస్ టైలర్ వంటి చిత్రాల్లో మంచి పాత్రల్లో నటించాడు. సిరివెన్నెల ,ముద్దుల మనవరాలు,గౌతమీ, గుండమ్మ గారి కృష్ణులు, భలేమొగుడు,అహ నా పెళ్ళంట, బంధువులొస్తున్నారు జాగ్రత్త,చెవిలో పువ్వు వంటి సినిమాల్లో చేసాడు.
నిర్ణయం,పెళ్లి పుస్తకం,ఆదిత్య 369,వంటి సినిమాల్లో నటించిన శుభలేఖ సుధాకర్ కెరీర్ మొదట్లో కామెడీ పాత్రల్లో జీవించాడు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇప్పుడు తండ్రి పాత్రల్లో ఒదిగిపోతున్నాడు. అప్పుడప్పుడు నెగెటివ్ క్యారెక్టర్స్ చేస్తూ,ఇటు వెండితెర,అటు బుల్లితెరపై శుభలేఖ సుధాకర్ తనదైన ముద్ర వేసాడు. అన్నట్టు ఇంటిపేరు సూరవఝల.శుభలేఖ సుధాకర్ ,శైలజ లు పెళ్లి అయ్యాక కొన్ని రోజులు కష్టాలు పడ్డారు. ఆ తర్వాత జీవితంలో సెటిల్ అయ్యారు. ఆ కష్టాలకు ఎవరిని నిందించలేదు. అలాగే ఎవరిని సాయం అడగకుండా వారి పాట్లు వారు పడ్డారు. వీరికి ఒక అబ్బాయి ఉన్నాడు.