Movies

అడవి రాముడు ఇండస్ట్రీ హిట్ కి కారణాలివే…అసలు నమ్మలేరు

అప్పటివరకూ ఎన్టీఆర్ పౌరాణిక పాత్రలతో సాంఘిక చిత్రాలతో రాణిస్తే, ఇక 1977లో వచ్చిన అడవి రాముడు ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. బాక్సాఫీసు రికార్డులు బద్దలు కొట్టడం అనేది ఈ మూవీ నుంచే స్టార్ట్ అయింది. నిజానికి ఈ సినిమా తీయడానికి కె రాఘవేంద్రరావు భయపడ్డారు. అప్పటికే తెరిమీద దైవత్వంతో వెలిగిన హీరోని ఎలా చూపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకుంటారోననే భయం. ఎన్టీఆర్ ఇక సినిమాల నుంచి తప్పుకుంటారా అని అందరూ అనుకునే సమయంలో కమ్యూనిజం భావాలకు కమర్షియల్ మెరుగులు దిద్ది మరీ అడవిరాముడు మూవీని రాఘవేంద్రరావు తెరకెక్కించాడు. మూడు కోట్లకు పైగా కలెక్షన్స్ చేసిన తొలి తెలుగు చిత్రం ఇదే.

నిజానికి కన్నడ కంఠీరవ రాజకుమార్ నటించిన మూవీని ప్రేరణగా తీసుకుని కథ తీర్చిదిద్దారు. అప్పటి వరకూ మద్రాసుకి పరిమితమైన ఎన్టీఆర్ ఏకంగా 30రోజులు అవుట్ డోర్ షూటింగ్ కి వచ్చారు. మధుమలై ఫారెస్ట్ లో షూటింగ్ ఎక్కువ చేశారు. ఎన్టీఆర్ తొలిసినిమా స్కోప్ కలర్ మూవీ కావడంతో లెన్స్ జపాన్ నుంచి రప్పించారు. హీరోయిన్స్ జయప్రద, జయసుధ లకు కొన్ని మైనర్ ఏక్సిడెంట్స్ జరిగాయి. 53రోజుల్లో 83లక్షలు 67రోజులకు కోటి రూపాయలు కలెక్ట్ చేసిన అడవిరాముడు 30కేంద్రాల్లో వంద రోజులు ఆడింది.

అప్పట్లో ఏపీలో అతి పెద్ద థియేటర్ వేంకటేశ లో 47రోజులు హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచిన మూవీ ఇది. ఇక 16కేంద్రాల్లో 175రోజులు అప్పట్లో రికార్డ్. ఇక నైజం లో 6కేంద్రాల్లో వందరోజులు ఆడిన మూవీ. నెల్లూరు లో 102రోజులపాటు రోజుకి 5షోల చొప్పున ప్రదర్శించారు. కాకినాడ దేవి 70ఎం ఎం లో 250రోజులు ఆడిన తొలిచిత్రం ఇదే. అంతెందుకు సికింద్రాబాద్ అజంతా థియేటర్ లో 161రోజుల రికార్డ్ ని ఇప్పటికీ ఏ మూవీ బద్దలు కొట్టలేదు. 4సెంటర్స్ లో 365రోజులు ఆడిన తోలి తెలుగు చిత్రం కూడా ఇదే.