చిరు పక్కన ఉన్న ఈ స్టార్ హీరోని గుర్తు పట్టారా…మిస్ కాకుండా చూడండి
ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమారుడిగా టాలీవుడ్ లోకి గంగోత్రి మూవీతో చిరంజీవి మేనల్లుడు అల్లు అర్జున్ తన టాలెంట్ తో స్టైలిష్ స్టార్ గా ఎదిగాడు. డాన్స్,ఫైట్స్,నటనతో ఎందరో అభిమానులను సొంతం చేసుకున్నాడు. మొన్న సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న బన్నీ ప్రస్తుతం పుష్ప మూవీ చేస్తున్నాడు.
కరోనా లాక్ డౌన్ కారణంగా షూటింగ్ వాయిదా పడడంతో కేరళలో షూటింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. పుష్ప సినిమాకు సంబంధించిన విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కి మంచి స్పందన వచ్చింది. గంధపు చెక్కల స్మగ్లర్ పాత్రను బన్నీ పోషిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ మూవీపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.
ఇక సోషల్ మీడియాలో కూడా బన్నీ స్పీడ్ గానే ఉంటాడు. వాళ్ళ పిల్లల ఫోటోలు షేర్ చేస్తూ ఉంటాడు. తాజాగా పెట్టిన ఓ ఫోటో మెగాస్టార్ చిరంజీవితో చిన్నప్పుడు కల్సి దిగిన ఫోటో కావడంతో మెగా అభిమానులను అలరిస్తోంది. ఫాన్స్ షేర్ చేస్తున్నారు. చిరంజీవి షూటింగ్ లో ఉండగా బన్నీ దిగిన ఫోటో తో పాటు మరో ఫోటో కూడా షేర్ చేసాడు.