Movies

వర్షం సినిమా వెనక ఎన్ని నమ్మలేని నిజాలు ఉన్నాయో…ఎన్ని కోట్ల లాభమో ?

ప్రభాస్ కి మంచి టర్నింగ్ పాయింట్ గా నిల్చిన సినిమా వర్షం. ఎం ఎస్ రాజు సూపర్ స్టార్ మహేష్ తో నిర్మించిన ఒక్కడు మూవీ తర్వాత ఎవరితో సినిమా చేస్తారో అని ఎదురుచూస్తున్న తరుణంలో పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ వీరుపోట్ల చెప్పిన లైన్ కి ఎం ఎస్ రాజు ఫిదా అవ్వడంతో దానికి అనుగుణంగా కథ అల్లేశారు. రావణుడు సీతను మోహించి లంకలో బంధిస్తాడు. రావణుడి నుంచి విడిపించడమే రాముని లక్ష్యం. ఇదే స్పూర్తితో ఓ అందమైన హీరోయిన్ చుట్టూ ఓ హీరో,ఓ విలన్ ,చెడ్డ తండ్రి .. వీటితో పాటు వర్షం ముఖ్యమైన క్యారెక్టర్ అయింది. వరంగల్ వేయి స్తంభాల గుడి బ్యాక్ డ్రాప్ తో స్టోరీ సెట్ అయింది. హిందీ తేజాబ్ లోని కొన్ని పాత్రలను ఇందులో తీసుకున్నారు. ఇక బాబీ మూవీ ప్లాప్ తో డైరెక్టర్ శోభన్ డిప్రెషన్ లో ఉన్నాడు. ఆ సమయంలో ఎం ఎస్ రాజు నుంచి ఫోన్ వచ్చింది. రైటర్ గా ఛాన్స్ ఇస్తారేమోనని వెళ్తే డైరెక్టర్ అఫర్ ఇచ్చేసారు.

ఇక స్టార్ కాని ప్రభాస్ ,ప్లాప్ డైరెక్టర్ శోభన్ తో కల్సి సినిమా ఏంటి అని అందరూ కామెంట్స్ సరేసరి. గంగోత్రి ద్వారా ఎంట్రీ ఇస్తున్న అదితి అగర్వాల్ హీరోయిన్ గా అనుకుంటే డేట్స్ ఉండవని,భావించి నాని షూటింగ్ లో ఉన్న మహేష్ ని కలవడానికి ఎం ఎస్ రాజు వెళ్తుంటే ఓ తమిళ పోస్టర్ లో ఓ అమ్మాయిని చూసారు. ఆ అమ్మాయి ఏ ఎం రత్నం తీస్తున్న తెలుగులో నీ మనసు నాకు తెలుసు మూవీలో కూడా ఆమె నటిస్తోందని తెల్సి కాంటాక్ట్ చేసారు. అలా హీరోయిన్ గా త్రిష సెలెక్ట్. ఇక విలన్ గా స్వింగ్ మీదున్న గోపీచంద్ ఎంపిక. హీరోయిన్ తండ్రిగా ప్రకాష్ రాజ్. దేవి సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇప్పించిన ఎం ఎస్ రాజు మళ్ళీ పిలవలేదు. ఇప్పుడు ఈ సినిమాకు మళ్ళీ ఛాన్సిచ్చాడు. సాంగ్స్ సిరివెన్నెల రాసారు. ఇక టైటిల్ వర్షం అనుకుంటే అప్పటికే నాగార్జున కోసం వి ఎన్ ఆదిత్య ఇదే టైటిల్ తో ఓ స్టోరీ రాస్తున్నాడు. ఎం ఎస్ రాజు అడిగిన వెంటనే లైన్ క్లియర్.

మార్చి 14న ఎం ఎస్ రాజు వైఫ్ పుట్టినరోజు కావడంతో అదేరోజు ఒక్కడు స్టార్ట్ చేసి విజయాన్ని నమోదుచేసుకోవడంతో సెంటిమెంట్ గా వర్షం కూడా అదేరోజు ప్రారంభం. షూటింగ్ జరుగుతుండగా ఎందుకో నచ్చక రెండు నెలలు బ్రేక్ ఇచ్చేసారు. విలన్ తో రెండు ఫైట్స్ పెట్టడం కన్నా ఒక డైలాగ్ ఉంటె చాలని భావించి, ‘శైలు కోసం నేను వందసార్లు చస్తాను. నువ్వు ఒక్కసారి చస్తావా’అనే ఒక్క డైలాగ్ తో విలన్ బుర్ర తిరిగిపోతుంది. అలా స్క్రిప్ట్ లో మార్పుతో మళ్ళీ షూటింగ్ స్టార్ట్. రైల్వే స్టేషన్ లో సాంగ్ అదిరిపోవాలని ప్రభుదేవాను పిలిస్తే వచ్చేసారు.

వారం పాటు ఇన్నాళ్లకు గుర్తొచ్చానా వానా సాంగ్ తీశారు. అరకులో కూడా ఓ సాంగ్,యాక్షన్ సీన్స్ తీశారు. సినిమాలో పాటలన్నీ హిట్. 140పనిదినాల్లో షూటింగ్ పూర్తి. 5కోట్ల బడ్జెట్. 2004సంక్రాంతికి పోటాపోటీ మధ్య 120ప్రింట్లతో 200థియేటర్స్ లో వచ్చిన వర్షం మూవీ కలెక్షన్స్ వర్షం కురిపించింది. రెండవ వారానికి మరో 80ప్రింట్లు పెంచారు. ఇక ఎప్పుడు వర్షం వచ్చినా ఆ సినిమా జ్ఞాపకాలు గుర్తొచ్చేలా, డేరింగ్ ప్రొడ్యూసర్ గా ఎం ఎస్ రాజుని నిలబెట్టిన మూవీ.