Movies

గోరింటాకు సినిమా గురించి నమ్మలేని నిజాలు..ఎన్ని కోట్ల లాభమో…?

యాంగ్రీ యంగ్ మ్యాన్ గా టాలీవుడ్ లో గుర్తింపు పొందిన హీరో డాక్టర్ రాజశేఖర్ అల్లరిప్రియుడు మూవీతో లవర్ బాయ్ గా కూడా అలరించాడు. ఫ్యామిలీ ఆడియన్స్ మూవీస్ కూడా చేసాడు. అందులో ముఖ్యంగా రాఖీ సెంటిమెంట్ తో ఒక మూవీ చేయగా,అందులో ఒక కీలక నటి నటించింది.

మీరా జాస్మిన్ అనగానే పలు సినిమాల్లో హీరోయిన్ గుర్తొస్తుంది. రాఖీ సెంటిమెంట్ గా వచ్చిన రాజశేఖర్ చెల్లెలుగా నటించి మెప్పించింది. అన్నా చెల్లెళ్ళ బంధానికి అసలైన నిర్వచనం చెబుతూ దాదాపు పుష్కర కాలం క్రితం గోరింటాకు పేరుతొ సినిమా వచ్చింది.

డాక్టర్ రాజశేఖర్ ఎమోషనల్ గా చెప్పిన డైలాగులు మహిళా ఆడియన్స్ ని బాగా ఆకట్టుకున్నాయి. హీరో ఆకాష్, శివాజీరాజా తదితరులు నటించిన ఈమూవీలో సాంగ్స్ సూపర్ హిట్. ఎస్ ఏ రాజకుమార్ సంగీతం బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా పేరు చెబితే ఇప్పటికీ అన్నాచెల్లెళ్ల బంధానికి గల క్రేజీ సినిమాగా గుర్తుంటుంది.