Movies

ఓటిటిలు అంటే ప్రొడ్యూసర్స్ కి భయమా…ఆలా ఎందుకు ఆలోచిస్తున్నారు

ప్రస్తుతం కరోనా కాలంలో ఇన్నాళ్లూ లాక్ డౌన్ కారణంగా అన్ని మూతపడినట్లే ఇండస్ట్రీ కూడా మూతపడింది. అన్ లాక్ లో మినహాయింపులు ఇచ్చినా ఇంకా ధైర్యంగా షూటింగ్స్ కి ముందుకు రావడం లేదు. మరోపక్క థియేటర్లకు అనుమతి ఇవ్వలేదు. అయితే కొన్ని సినిమాలు పూర్తయి,తొలికాపీతో రిలీజ్ కి సిద్ధంగా ఉన్న సినిమాలు ఉన్నాయి. కొన్ని చివరి దశల్లో ఉన్నాయి. మరొకొన్ని మధ్యలోనే ఆగిపోయాయి.

ఇంకా కొన్ని సెట్స్ మీదికి వెళ్ళాలి. పూర్తయిన సినిమాల కోసం పెట్టుబడి పుట్టినవాళ్ళు నరకం చూస్తున్నారు. ఫైనాన్స్ పెరిగిపోతూ ఉంటుంది. వడ్డీలు కట్టాలి. అలాగని సినిమా రిలీజ్ కి ఛాన్స్ లేదు. అయితే కొత్తగా ఓటిటి ఫ్లాట్ ఫామ్స్ వచ్చినా అంతగా ఆకట్టుకోలేదు. కానీ లాక్ డౌన్ కష్టాలు నేపథ్యంలో ఓటిటి ని ఆశ్రయించక తప్పడం లేదు. ఇప్పటికే కొందరు ఓటిటి బాట పట్టారు. అల్లు అరవింద్ లాంటి వాళ్ళు అయితే ఏకంగా ఆహా ఓటిటి కూడా పెట్టేసారు.

ఇప్పటికే బాలీవుడ్ లో ఓటిటి బాట పట్టినా సుశాంత్ సినిమా ఒక్కటే సానుభూతితో రిసీవ్ చేసుకున్నట్లు కన్పిస్తోంది. అందుకే కనీసం అక్టోబర్ దసరాకు అయినా థియేటర్లపై క్లారిటీ వస్తుందా అంటే అదీ కన్పించడం లేదు. ఒకవేళ చక్కబడినా మూడు మాసాల్లో 12శుక్రవారాలు వస్తాయి. అప్పుడు పోటీ పడకుండా ఒకదానివెనుక ఒకటి రిలీజ్ చేసుకుంటే బయటపెడతామని కొందరి ప్రొడ్యూసర్స్ ఆలోచనగా ఉంది. ఈలోగా కంగారు పడిపోయి ఓటిటి కి అమ్మేస్తే ఆతర్వాత రిలీజ్ కి సినిమాలు కూడా ఉండవు. మరి ప్రొడ్యూసర్స్ ఆలోచనలు ఫలిస్తాయో లేదో చూడాలి.